UPDATES  

NEWS

సి.పి.ఎస్ రద్దు చేయాలని ఉపాధ్యాయుల డిమాండ్ తడి చెత్త పొడి చెత్త వేరుగా చేసి ఇస్తున్నా ప్రజలు కొత్తగూడెం మేయర్ బరిలోకి ప్రముఖ విద్యావేత్త డా. యం.వీరనాయక్ తెలంగాణ వాణి దిన పత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఖేడ్ డిఎస్పి వెంకట్ రెడ్డి ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలి: టి పి టి ఎఫ్ మండల అధ్యక్షుడు బి.సుక్య సర్పంచ్ కె.రవి ను సన్మానం చేసిన సొసైటీ వైస్ చైర్మన్ కాంపల్లి కనకేష్‌ కిన్నెరసాని గ్రామపంచాయతీ సర్పంచ్ వజ్జ రామకృష్ణ, ఉపసర్పంచ్ వజ్జా ఇంద్రజ ఆధ్వర్యంలో ముగిసిన క్రికెట్ టోర్నమెంట్ మహిళల కళలకు వేదికగా ముగ్గుల పోటీలు దేశ అభివృద్ధి మోదీ లక్ష్యం- రఘునాధ్

 విద్యుత్ కార్యాలయంలో  ఇంటి దొంగలు

విద్యుత్ శాఖకు సంబంధించిన పాత ఇనుప స్తంభాలు మరియు సామగ్రి చీకట్లో అక్రమంగా తరలింపు

వాటిని అమ్ముకుని జేబులు నింపుకున్న ఓ అధికారి…?

జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో కొన్ని రోజుల క్రితం జీవీఎంసీ వారు చేపట్టిన రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా విద్యుత్ శాఖ సిబ్బంది పాత ఇనుప విద్యుత్ స్తంభాలను, సామగ్రిని తీసి వాటి స్థానంలో కొత్త సిమెంట్ స్తంభాలను, కొత్త సామగ్రి అమర్చారు.తొలగించిన విద్యుత్ ఇనుప స్తంభాలను మరియు సామాగ్రిని అనకాపల్లి బెల్లం మార్కెట్ నందు ఉన్న విద్యుత్ సబ్ స్టేషన్ లో ఉంచారు.

రోజులు వారాలుగా మారి నెలలు గడుస్తున్నా ఉన్నతాధికారులు ఆ స్తంభాలు మరియు సామగ్రి కోసం ఏమి మాట్లాడకపోవడంతో ఆ ఇనుప స్తంభాలను నోట్ల కట్టలుగా మలచుకుంటే బాగుంటుందని ఆలోచన వచ్చి కార్యరూపం దాల్చడు.  అవి అక్కడే ఉంటే ఎండకి కరిగిపోతాయని అనుకున్నాడో ఏమో, ఓ రోజు రాత్రి నైట్ షిఫ్ట్ సిబ్బంది విధులలో నిమగ్నమై ఉండగా ఈ అధికారి బయట నుంచి వెల్డింగ్ చేసే సిబ్బందిని వెంట తీసుకుని వచ్చాడు..వేల రూపాయలు విలువ చేసే ఇనుప సామాగ్రిని మరియు స్తంభాలను తరలించేందుకు వీలుగా ఉండే సైజులో ముక్కలుగా కోయించి వారి వెంట తెచ్చుకున్న వాహనంలో రాత్రికి రాత్రే మాయం చేసి, తరువాత ఐరన్ స్క్రాప్ దుకాణం నందు విక్రయించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అయితే అక్కడ విధులు నిర్వహిస్తున్న విద్యుత్ సిబ్బందికి ఈ తతంగమంతా తెలిసినా ఏమీ తెలియలేనట్లు ఉన్నారో, లేక తెలిసి కూడా తమ పైఅధికారిని ప్రశ్నించలేక మౌనంగా ఉన్నారో తెలియదు కానీ, ప్రభుత్వ ఖజానా కి వెళ్లాల్సిన నిధులు దారి తప్పించి తన జేబులో వేసుకోవడం అనేది ఆ అధికారిది సాహసోపేతమైన నేరం అనే చెప్పాలి.

భవిష్యత్తులో ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా కాపడవలసిన అధికారులే ఇటువంటి చర్యలకు పాల్పడడం సిగ్గుచేటుగా భావించవచ్చు. విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు కార్యాలయ ఆవరణలో భద్రపరిచిన ఇనుప సామాగ్రి మాయమైన విషయంపై విచారణ చేపట్టి ఇంటి దొంగను పట్టుకొని సగటు అధికారిపై శాఖ పరమైన  చర్యలు తీసుకొని, మళ్లీ ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా తగు చర్యలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.వేల రూపాయలు విలువ చేసే సామగ్రి అలా అక్రమంగా తరలి పోవడం పట్ల  ఉన్నాతాధికారులు  ఏ మేరకు చర్యలు చేపడతారో తెలియవలసి ఉంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest