సాంబమూర్తి దేవాలయ అభివృద్ధి కమిటీ ఏకగ్రీవం
ధర్మారం (తెలంగాణ వాణి )
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని రచ్చపల్లి గ్రామంలో ఉన్న సాంబమూర్తి దేవాలయ అభివృద్ధి కమిటీ ని ఆదివారం స్థానిక సర్పంచ్ సూర రజిత వెంకటేశం ఆధ్వర్యంలో ఆదివారం ప్రత్యేక సమావేశమై నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చైర్మన్ గా కోలా వెంకటేశం, వైస్ చైర్మన్ గా పెరిక మహేష్, ప్రధాన కార్యదర్శిగా బైరి మహేష్, కోశాధికారిగా మోర గణపతి, చింతల సూర్య ప్రకాష్, ప్రచార కార్యదర్శిగా మెరుగు మహేష్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు స్థానిక సర్పంచ్ సూర రజిత వెంకటేశం తెలిపారు. అనంతరం చైర్మన్ మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.
Post Views: 10
