సిరిసిల్ల కలెక్టర్ బదిలీ – దేవుడికి మొక్కులు చెల్లించిన పట్టణ ప్రజలు
రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ 27 (తెలంగాణ వాణి)
సిరిసిల్ల కలెక్టర్ బదిలీతో పట్టణ ప్రజలు ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. సిరిసిల్లలోని అభయాంజనేయ స్వామి దేవాలయంలో వారు ప్రత్యేక పూజలు చేసి, కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన ప్రజలు, తమ ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకోవడంతో వీడియోలు వైరల్‌గా మారాయి.
Post Views: 94



