UPDATES  

కాళోజికి నివాళులర్పించిన న్యాయవాద పరిషత్

నిజామాబాద్ సెప్టెంబర్ 09: (తెలంగాణ వాణి ప్రతినిధి)

ప్రజల గొంతుకై గళమెత్తిన కాళోజీ హైదరాబాద్ సంస్థాన విమోచన కోసం ఉద్యమం నడిపిన కాళోజీ నారాయణ రావు ప్రజాజీవితం ఆదర్శనీయమని ‌‌

‌న్యాయవాద పరిషత్ జిల్లా అధ్యక్షుడు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్ అన్నారు. కాళోజీ111 జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కవితలు, కథలు రచించి ప్రజా ఉదయమానికి పూనాదులు వేశారని కొనియాడారు. నిజామ్ ప్రజా వ్యతిరేక పాలనకు నాటి ఉద్యమ నాయకులతో పోరుబాట నిర్మించారని తెలిపారు.హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్ లో కలిసిన తర్వాత ఆంద్రప్రదేశ్ రాష్ట్రం గా ఏర్పడిన నేపథ్యంలో ఆంధ్ర పాలకుల నిర్లక్ష్యం కారణంగా తెలంగాణ భాషకు,సంస్కృతి కి,వనరులకు జరుగుతున్న నష్టం చూసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం గళమెత్తిన గొప్ప వ్యక్తి అని అభివర్ణించారు. కార్యక్రమంలో న్యాయవాదులు రాజ్ కుమార్ సుబేదార్, వసంత్ రావు నారాయణ దాస్ శరత్ చంద్ర తదితరులు పాల్గొన్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest