మధ్యప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రటరిని కలిసిన మండల ఓబీసీ నాయకులు
ధర్మారం (తెలంగాణ వాణి)
పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ వాస్తవ్యులు కీర్తిశేషులు పరికిపండ్ల సత్యనారాయణ 9వ వర్ధంతి సందర్భంగా బసంత్ నగర్ విచ్చేసిన మధ్యప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ పరికిపండ్ల నరహరి (ఐఏఎస్) ను శనివారం బసంత్ నగర్ లోని వారి నివాసంలో ఏఎంసీ మాజీ చైర్మన్ కొత్త నరసింహులు ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసారు. అనంతరం సత్యనారాయణ చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో ఓబిసి ప్రజా నాయకులు గంధం మల్లయ్య, ఆకుల రాజేందర్, సాగంటి కొండయ్య, ఆవుల మల్లయ్య, ఆకుల స్వామి, పొలం ప్రసాద్, ఆకుల వీరస్వామి, బాలసాని చంద్రమౌళి, ఆశన వేణి రాజ్ కుమార్, లింగంపల్లి రమేష్, తోడేటి మురళి గౌడ్, మామిడి శెట్టి శ్రీనివాస్, ధ్యాగేట్ కొమురయ్య, బొల్లం మల్లేశం, తాళ్లపల్లి సురేందర్ గౌడ్, రాజమల్లు, ఓదెలు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 444