ఎంపీడీవో,కార్యాలయ సిబ్బందిని మర్యాదపూర్వకంగా కలసిన సర్పంచ్ తాటి అనిత,ఉప సర్పంచ్ పాంచానపరుపు మహేష్
లక్ష్మీదేవిపల్లి మండల పరిషత్ అభివృద్ధి అధికారిణి ను ఎంపీఓ, సూపరిండెంట్ మరియు కార్యాలయ సిబ్బందిని మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన సర్పంచ్ తాటి అనిత,ఉప సర్పంచ్ పాంచానపరుపు మహేష్. ఈ కార్యక్రమంలో తాటి తిరుమలేష్,కోటి,చిట్టి, తదితరులు ఉన్నారు.ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి,ప్రజా సంక్షేమంపై పరస్పర సహకారం కొనసాగించాలని ఆకాంక్షించారు.
కార్పొరేషన్ ముసుగులో మద్యం దందా : యెర్రా కామేష్

కొత్తగూడెం (తెలంగాణ వాణి) కొత్తగూడెం కార్పొరేషన్ ముసుగులో మద్యం దందాకు తెరలేపారని జై భీమ్ రావు భారత్ పార్టీ(జేబీపీ) స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ విమర్శించారు. గురువారం పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొత్తగూడెం కార్పొరేషన్ అయితే అభివృద్ధి జరుగుతుందని పెద్ద ఎత్తున నిధులను తీసుకువచ్చి అభివృద్ధి చేస్తామని ప్రగల్భాలు పలికారని, కాని ఆవిధంగా ఎలాంటి చర్యలు తీసుకోక పోవడం విచారకరమన్నారు. కార్పొరేషన్ పరిధిలో గతంలో ఎన్నడూ లేనివిధంగా కొత్తగూడెం […]
పల్లెల్లో మద్యం ఏరులై పారాలే

జూలూరుపాడు వైన్ షాపు యజమానుల ‘బెల్ట్’ దందా సిండికేట్ ఏర్పాటుకు అంతా సిద్ధం జూలూరుపాడు (తెలంగాణ వాణి) మండలంలో మద్యం షాపు యజమానులు సిండికేట్ దందాకు తెరలేపారు. అధిక లాభాలు గడించేందుకు బెల్టుషాపుల నిర్వాహకులతో ఒప్పందం చేసుకుని అడ్డదారులు తొక్కుతున్నారు. మండలంలోని 24 గ్రామాల్లో 2 మద్యం షాపులు ఉండగ మద్యం వ్యాపారులు సిండికేట్ గా మారి మరోమారు మద్యం ప్రియులపై భారం మోపనున్నారు. మందుబాబుల పైనే భారం అంతా గల్లీ గల్లీకి బెల్ట్ షావు పెట్టేలా […]
శ్రీ చైతన్య పాఠశాలలో నూతన సంవత్సర దినోత్సవ వేడుకలు

జగిత్యాల/ వెల్గటూర్:(తెలంగాణ వాణి ప్రతినిధి) మండల కేంద్రంలోని శ్రీ చైతన్య మోడల్ పాఠశాలలో నూతన సంవత్సర దినోత్సవ వేడుకలను ప్రధానోపాధ్యాయులు బిడారి సతీష్ ఆధ్వర్యంలో చిన్నారుల చేత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ 2025 సంవత్సరానికి ముగింపు పలుకుతూ 2026 సంవత్సరానికి స్వాగతం పలికారు. విద్యార్థులు గత సంవత్సరంలో చేసిన తప్పులను మళ్ళీ చేయకుండా విద్యను కష్టంగాకుండా ఇష్టంగా చదవాలని కొనియాడారు. ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని దానికి సాధన చేయాలని తెలిపారు. […]
మహిళా సాధికారత పూలే సావిత్రిబాయి ఘనత

ధర్మారం (తెలంగాణ వాణి) పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని గౌతమ బుద్ధ ఫంక్షన్ హాల్ లో గురువారం కరెన్సీ పై అంబేద్కర్ ఫోటో సాధన సమితి జాతీయ ఉపాధ్యక్షులు బొల్లి స్వామి అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్య క్రమానికి పలువురు మండల దళిత బహుజన నాయకులు హాజరైనారు.అనంతరం పూలే, సావిత్రిబాయి చిత్రపటాలకు పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం బొల్లి స్వామి మాట్లాడుతూ.. పూణే, బాంబే లోని 141 బాల బాలికల […]
లక్ష్మీదేవి పల్లి గ్రామ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు: సర్పంచ్ తాటి అనిత
లక్ష్మీదేవి పల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ తాటి అనిత నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.గత సంవత్సరం అనుభవాలను పాఠాలుగా తీసుకుని,కొత్త ఏడాది గ్రామ అభివృద్ధి,ప్రజల శ్రేయస్సు, సుఖసంతోషాలతో సాగాలని ఆమె ఆకాంక్షించారు.గ్రామ ప్రజలందరికీ ఆరోగ్యం,ఆనందం,సమృద్ధి కలగాలని పాడి పంటలు బాగా పండాలని,గల్లీ గల్లీ తిరుగుతూ ప్రజలను ప్రత్యక్షంగా కలిసి తాటి అనిత తిరుమలేష్ దంపతులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.