సర్పంచ్ గా భాద్యతలు చేపట్టిన ప్రేమేందర్

లక్ష్మిదేవిపల్లి (తెలంగాణ వాణి) సర్పంచిగా హమాలీ కాలనీ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే తన ధ్యేయమని నూతన సర్పంచ్ గా భాద్యతలు చేపట్టిన సర్పంచ్ గుగులోత్ ప్రేమేందర్ అన్నారు. మంగళవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో భాద్యతలు చేపట్టిన సందర్భంగా సర్పంచ్ ప్రేమేందర్ మాట్లాడుతూ హమాలీ కాలనీ గ్రామాన్ని అభివృద్ధి చేయడమే ధ్యేయంగా పనిచేస్తానన్నారు. రాజకీయాలకు అతీతంగా పాలకవర్గం సహకారంతో కలిసి గ్రామాభివృద్ధి కోసం కృషి చేస్తానన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి […]