ప్రముఖ వైద్యులు డాక్టర్ నరసింహ జీవన్ కుమార్ ను కలిసిన గురుకులం బాల్య మిత్రులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గణేష్ టెంపుల్ ఏరియాలో ఉన్న యామిని హాస్పిటల్‌ను దమ్మపేట గురుకుల పాఠశాల మిత్రులు సందర్శించారు. ఈ సందర్భంగా ప్రముఖ వైద్యులు డాక్టర్ నరసింహ జీవన్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.మిత్రులు మాట్లాడుతూ డాక్టర్ నరసింహ జీవన్ కుమార్ వైద్యరంగంలో చేస్తున్న సేవలు,ప్రజల పట్ల చూపుతున్న అంకితభావం ప్రశంసనీయమని పేర్కొన్నారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలకు మరింత మంచి వైద్యసేవలు అందించి మన్ననలను పొందాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో దశరథ్, రాము,బాలు,మంగీలాల్ మరియు నాగేష్ […]
ఫుట్ బాల్ లో రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థులు

ధర్మారం (తెలంగాణ వాణి విలేఖరి) మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల కళాశాల విద్యార్థులు ఫుట్బాల్ విభాగంలో అండర్ 19 లో రాష్ట్రస్థాయికి ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ ఈరవేణి రాజ్ కుమార్ తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈనెల 7న కరీంనగర్ బిఆర్ అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన ఎస్జిఎఫ్ అండర్ 19 బాలికల విభాగంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా సెలక్షన్స్ లో ధర్మారం ఆదర్శ కళాశాలకు చెందిన 11 మంది విద్యార్థులు రాష్ట్రస్థాయికి ఎంపికైనట్లు తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు ఈనెల […]
అత్యున్నత న్యాయవ్యవస్థపై దాడి దారుణం

ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మహమ్మద్ అబ్దుల్ రహీం ఖమ్మం (తెలాంగాణ వాణి ప్రతినిధి హనీఫ్ పాషా) మతోన్మాదం ఏ విధంగా రెచ్చిపోతుందో చెప్పడానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి ఆర్ గవాయిపై జరిగిన దాడే ప్రధాన సాక్ష్యం అని, దాడి చేసిన రాకేష్ కిషోర్ ను కఠినంగా శిక్షించాలని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడు మొహమ్మద్ అబ్దుల్ రహీం డిమాండ్ చేశారు. సభ్యసమాజం తలదించుకునేలా […]
ఖమ్మం ఆర్టీసీ దసరా స్పెషల్ లక్కీ డ్రా

ఖమ్మం (తెలాంగాణ వాణి ప్రతినిధి హనీఫ్ పాషా) దసరా పండుగ నేపథ్యంలో, ప్రయాణీకులను ఆకర్షించేందుకు – ప్రయాణీకుల ఆదరణను పెంచుకోవడానికి తెలంగాణా రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ ప్రకటించిన లక్కీ డ్రా ను ఉమ్మడి ఖమ్మం జిల్లా రీజియన్ పరిధిలో ఈరోజు ఖమ్మం నూతన బస్టాండ్ లో ప్రయాణీకుల సమక్షంలో నిర్వహించడం జరిగింది. ఖమ్మం అడిషనల్ కలెక్టర్ పి.శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా సదరు లక్కీ డ్రా ను నిర్వహించి విజేతలను ప్రకటించడం జరిగింది. విజేతల వివరాలుఇలా […]
కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్

బీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సిర్సే సంజీవ్ బోథ్ (తెలంగాణా వాణి ప్రతినిధి) బోథ్ మండలంలోని మర్లపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సిర్సే సంజీవ్ గురువారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయనకు ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సిర్సే సంజీవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో ఎన్నో సంవత్సరాల నుంచి కొనసాగుతున్నానని, పార్టీలో ఉండి ప్రజలను పార్టీ చేస్తున్న మోసాలు […]
ఆటో కార్మికులను ఆగం చేసిన కాంగ్రెస్ – దాస్యం వినయ్ భాస్కర్
ఖాజీపేట రైల్వే స్టేషన్ ఆటోయూనియన్ ఆధ్వర్యంలో కార్యక్రమం…. బాకీ కార్డులను విడుదల చేసిన మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తెలంగాణ వాణి,ఉమ్మడి వరంగల్ బ్యూరో, (అక్టోబర్ 8) : కాంగ్రెస్ నాయకులను ఎక్కడపడితే అక్కడ నిలదీయాలని ప్రభుత్వ మాజీ చీప్ విప్ ,బి ఆర్ ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు.హనుమకొండ లోని కాజీపేట రైల్వే స్టేషన్ వద్ద ఆటో డ్రైవర్ల యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన […]