వర్షం పడితే చెరువును తలపిస్తున్న సరస్వతి కాలనీ.. డ్రైనేజ్ ఏర్పాటు చేయాలి
లక్ష్మీదేవి పల్లి మండలం సంజయ్ నగర్ గ్రామ పంచాయతీ పరిధిలోని హమాలీ కాలనీ,సరస్వతీ కాలనీ నందు చిన్న వానకే చెరువును తలపిస్తున్నా పట్టించు కోవడం లేదని స్థానిక ప్రజలు అవేదన వ్యక్తం చేస్తున్నారు.సైడ్ డ్రైనేజ్ కాలువలు లేకపోవడంతో వర్షపు నీరు రోడ్లన్నీ కప్పేస్తూ చెరువుల్లా మారుతోందనీ అంటున్నారు.విద్యార్థులు, పాదచారులు,కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు.ఇకనైనా అధికారులు స్పందించి డ్రైనేజీ కాలువల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వ అధికారులు,ప్రజా ప్రతినిధులను కాలనీవాసులు కోరుతున్నారు.
ఎన్నికల కోడ్ ప్రభావం… ప్రజావాణి నిపిలివేత!

సిరిసిల్ల కలెక్టర్ ఎం. హరిత కీలక నిర్ణయం రాజన్న సిరిసిల్ల జిల్లా,అక్టోబర్ 5 (తెలంగాణ వాణి): సిరిసిల్ల సమీకృత కార్యాలయాల సముదాయంలో ప్రతి సోమవారం నిర్వహించబడే ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎం. హరిత ప్రకటించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలై, కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ప్రజల వినతులను స్వీకరించడం ఎన్నికల నియమావళికి విరుద్ధమని ఆమె స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్ ముగిసేంతవరకు ప్రజావాణి కార్యక్రమం నిలిపివేయబడుతుంది. అనంతరం యధావిధిగా పునరుద్ధరిస్తాం కలెక్టర్ […]
బడుగు బలహీన వర్గాల ప్రజల్లో వెలుగులు నింపిన వ్యక్తి కాక : మంత్రి లక్ష్మణ్ కుమార్

ధర్మారం (తెలంగాణ వాణి విలేకరి) మాజీ కేంద్రమంత్రి గడ్డం వెంకటస్వామి (కాక) 96వ జయంతి వేడుకలు ధర్మారం మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీ వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై కాకా చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. నిరంతరం పేదల అభ్యున్నతి […]
ఘనంగా కాక జయంతి వేడుకల ఏర్పాట్లు : కాడే సూరి

ధర్మారం (తెలంగాణ వాణి విలేకరి) పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని అంబేద్కర్ కూడలిలో ఆదివారం ఉదయం 11 గంటలకు మాజీ కేంద్రమంత్రి గడ్డం వెంకట్ స్వామి 96వ జయంతి వేడుకల కార్యక్రమం ఘనంగా నిర్వహించనున్నారు. కాకా ఫౌండేషన్ సభ్యులు కాడే సూర్యనారాయణ అధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి కేక్ కట్ […]