డిఫాల్ట్ మిల్లర్లపై రెవెన్యూ రికవరీ యాక్టు అమలు చెయ్యండి కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి నిజామాబాద్, సెప్టెంబర్ 12 : (తెలంగాణ వాణి ప్రతినిధి) సీ.ఎం.ఆర్(కస్టమ్ మిల్లింగ్ రైస్) అందించడంలో విఫలమైన డిఫాల్ట్ రైస్ మిల్లర్లపై నిబంధనల మేరకు రెవెన్యూ రికవరీ యాక్టును అమలుపర్చాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి తహసీల్దార్ లను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుండి కలెక్టర్ తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. డిఫాల్ట్ మిల్లర్లపై ఇప్పటివరకు చేపట్టిన […]