దాసాంజనేయ భజన మందిరంలో భక్తుల ప్రత్యేక పూజలు
లక్ష్మీదేవిపల్లి మండలంలోని ప్రసిద్ధ దాసాంజనేయ భజన మందిరంలో మంగళవారం రోజు ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారణల మధ్య అభిషేకాలు నిర్వహించగా, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి దర్శనం చేసుకొని తీర్ధ ప్రసాదాలు స్వీకరించి ఆశీర్వాదాలు తీసుకున్నారు.ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తి శ్రద్ధలతో నిండిపోయింది.పూజ అనంతరం ప్రసాదం పంపిణీ చేశారు.