జనంసాక్షి పత్రిక సంపాదకుడు రెహమాన్ పై పెట్టిన అక్రమ కేసును వెంటనే ఎత్తివేయాలి

కాలుష్యాన్ని వెదజల్లుతున్న ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో చెలరేగిన హింసకు బాధ్యుడిగా జనంసాక్షి పత్రిక సంపాదకుడు రెహమాన్ పై కేసు పెట్టడాన్ని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు సంఘం తీవ్రంగా ఖండించింది. అక్కడ జరుగుతున్న రైతు ఉద్యమంలో జర్నలిస్ట్ మిత్రుడు రెహమాన్ ప్రత్యక్షంగా లేనప్పటికి అతన్ని A2 గా చేరుస్తూ ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ఏమాత్రం సరికాదని సంఘం అధ్యక్షులు అల్లం నారాయణ, కార్యదర్షి ఆస్కాని మారుతి సాగర్ లు ఖండించారు. ఈ విషయమై […]