ధర్మారం (తెలంగాణ వాణి ప్రతినిది) సుప్రీం కోర్టు జస్టిస్ బీఆర్ గవాయి పై జరిగిన దాడికి నిరసనగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఇచ్చిన పిలుపుమేరకు ఈనెల 17న ఢిల్లీలోని జంతర్ మంతర్ లో జరుగనున్న దళితుల ఆత్మగౌరవ సభకు సంబందించిన కరపత్రాన్ని శుక్రవారం ధర్మపురి క్యాంపు కార్యాలయంలో సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు ఎమ్మార్పీఎస్ మండల కన్వీనర్ ఇరుగురాల మహేష్ అందించారు. ఈ కార్యక్రమంలో కో-కన్వీనర్ నెరువట్ల అభిలాష్, ఇక్కడ పల్లె సతీష్ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 186



