పాత పెన్షన్ విధానమే శాశ్వత పరిష్కారం
-లేనిపక్షంలో ఉద్యమం ఉధృతం చేస్తాం
-భారీ నిరసన ర్యాలీ తో కలెక్టర్ కి వినతి పత్రం
-టీజీఈజేఏసీ జిల్లా చైర్మన్ గడియారం శ్రీహరి
మంచిర్యాల, సెప్టెంబర్ 01 (తెలంగాణ వాణి):
‘సీపీఎస్’ రద్దు చేసి ‘ఓపీఎస్’ పునరుద్దించాలని రాష్ట్ర టీజీఈజేఏసీ ఇచ్చిన పిలుపుమేరకు మంచిర్యాల జిల్లా టీజీఈజెఎసి చైర్మన్ గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల జిల్లాలోని 18 మండలాల అధ్యక్షలు, ప్రధాన కార్యదర్శులు నాయకులు,సభ్యులు,ఉద్యోగులు, ఉపాధ్యాయులు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం వద్ద మానవహారం చేసి ర్యాలీగా బయలుదేరి జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా మీడియాతో జిల్లా చైర్మన్ గడియారం శ్రీహరి మాట్లాడుతూ..రెండు దశాబ్దాలుగా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు.సీపీఎస్ వలన వారి కుటుంబాలు నేడు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారని సీపీఎస్ రద్దు కొరకు ‘ఓపీఎస్’ పునరుద్దీరణ కొరకు వివిధ రకాలుగా టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహించామని అన్నారు. ప్రభుత్వంలో భాగమైన ప్రభుత్వ ఉద్యోగులనే ఇంత చిన్నచూపు చూసినట్లయితే, ప్రభుత్వ కార్యక్రమాలు ఎలా విజయవంతం అవుతాయని, ఇటువంటి వివక్ష ఇంకెన్నాళ్లు కొనసాగుతుందని, వెంటనే ‘సీపీఎస్’ రద్దు చేసి ‘ఓపీఎస్’ పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.వివిధ సంఘాల జేఏసీ నాయకులు మాట్లాడుతూ సీపీఎస్ ఉద్యోగుల భవిష్యత్తును దెబ్బతీస్తోందని, జీవన భద్రతకు హాని కలిగిస్తోందని పేర్కొన్నారు. వృద్ధాప్యంలో కనీస భరోసా కలిగించే పాత పెన్షన్ విధానమే శాశ్వత పరిష్కారం అని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యను తక్షణం పరిష్కరించాలని, లేకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని జేఏసీ నేతలు హెచ్చరించారు. జిల్లా జేఏసీ ఆధ్వర్యంలోని అనేక సంఘాల ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యోగుల టీజీఈజేఏసీ సెక్రెటరీ జనరల్ వనజా రెడ్డి, పిఆర్టియు తెలంగాణ జిల్లా అధ్యక్షులు ధరణికోట వేణుగోపాల్,ప్రధాన కార్యదర్శి సూరినేని గంగాధర్, ఎస్టియుటిఎస్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పోకల వెంకటేశ్వర్లు,టీఎన్జీవో రాష్ట్ర కార్యదర్శి పొన్న మల్లయ్య, యూనియన్ నాయకులు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.