UPDATES  

 షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..

షాపూర్జీ పల్లోంజీ గ్రూప్-ఆధారిత నిర్మాణ, ఇంజనీరింగ్ ప్లేయర్ ఆఫ్కాన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (IPO)గా రానుంది. ఈ ఐపీఓ ద్వారా రూ.

7,000 కోట్లను సమీకరించడానికి సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబి)కి డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (డిఆర్‌హెచ్‌పి)ని దాఖలు చేసింది. సంస్థ తాజా ఇష్యూ ద్వారా రూ.1,250 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్ ద్వారా రూ.5,750 కోట్లు సమీకరించనుంది.

డిఆర్‌హెచ్‌పి ప్రకారం గోస్వామి ఇన్‌ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ఓఎఫ్‌ఎస్‌లో దాదాపు రూ.5,750 కోట్ల విలువైన వాటాలను విక్రయించనుంది. డిసెంబర్ 2023 నాటికి, సంస్థలో గోస్వామి ఇన్‌ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్‌కు 72.35 శాతం వాటా ఉండగా, షాపూర్జీ పల్లోంజీ అండ్ కంపెనీకి 16.64 శాతం వాటా ఉంది. ఇష్యూ ద్వారా వచ్చిన రూ. 150 కోట్ల విలువైన మూలధన వ్యయానికి, రూ. 350 కోట్లను దీర్ఘకాలిక వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు ఉపయోగించనున్నారు. రూ. 500 కోట్లను కంపెనీ డెట్ క్లియర్ చేయనున్నారు.

 

డిసెంబర్ 2023 నాటికి ఈ కంపెనీకి రూ. 2887.59 కోట్ల డెట్ ఉంది. ఈ ఐపీఓకు ఐసీఐసీ సెక్యూరిటీస్, DAM క్యాపిటల్, నోమురా, జెఫరీస్ మరియు SBI క్యాపిటల్ ఇోష్యూకి లీడ్ మేనేజర్లుగా ఉన్నాయి. దేశీయంగా, అంతర్జాతీయంగా సంక్లిష్టమైన EPC ప్రాజెక్ట్‌లను అమలు చేయడంలో కంపెనీ బలమైన ట్రాక్ రికార్డ్‌ను కలిగి ఉంది. గత పది ఆర్థిక సంవత్సరాల్లో, సెప్టెంబర్ 30, 2023 వరకు ఈ సంస్థ 15 దేశాలలో 76 ప్రాజెక్ట్‌లను పూర్తి చేసింది.

మొత్తం చారిత్రాత్మకంగా అమలు చేయబడిన కాంట్రాక్ట్ విలువ రూ. 52,200 కోట్లు. ప్రస్తుతం వారు 13 దేశాలలో 67 యాక్టివ్ ప్రాజెక్ట్‌లను కలిగి ఉన్నారు. మొత్తం రూ. 34,888 కోట్ల ఆర్డర్ బుక్ ఉండగా.. ఇందులో రూ. 26,093 కోట్ల దేశీయ ఆర్డర్ బుక్, రూ. 8,795.32 కోట్ల ఓవర్సీస్ ఆర్డర్ బుక్‌ను కలిగి ఉంది. వారు అటల్ టన్నెల్, హై-స్పీడ్ రైల్వే ప్రాజెక్ట్, ఢిల్లీ – మీరట్ రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్, ఢిల్లీ మెట్రో ఫేజ్ IV వంటి క్లిష్టమైన ప్రాజెక్ట్‌లను చేశారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest