వేములవాడ: ఫిబ్రవరి 21 (తెలంగాణ వాణి):
వేములవాడ మున్సిపల్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన పుల్కం రాజు మరియు వైస్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన నరాల శేఖర్ ల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై, నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం చైర్మన్, వైస్ చైర్మన్లను పూలమాలలతో సన్మానించి, వేములవాడ పట్టణ అభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలని ఆకాంక్షించారు.
పట్టణ ప్రజల సమస్యల పరిష్కారంలో కొత్త పాలకవర్గం ముందుండాలని ఆయన సూచించారు.

Post Views: 52

