వరద బాధితులకి చేయూతనిచ్చిన జనసేన పార్టీ నాయకులు
వేములవాడ,సెప్టెంబర్ 02 (తెలంగాణ వాణి) :
జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని వరద బాధితులకు మంగళవారం నిత్యవసర వస్తువులు పంపిణీ చేశారు.ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వేములవాడ నియోజకవర్గంలో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి ఇబ్బందులకు గురైన ప్రజలకి జనసేన పార్టీ నాయకులు బుర్ర అజయ్ బబ్లు గౌడ్ ఆధ్వర్యంలో 150 కుటుంబాలకు నిత్యవసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షాల కారణంగా రోజువారి కూలీకి వెళ్లే నిరుపేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు తమ దృష్టికి రావడం జరిగిందని, పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా తాము వారికి చేయూతనివ్వడానికి నిత్యవసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది తెలిపారు.ఇలానే ప్రజాసేవ కార్యక్రమాలు నిర్వహిస్తూ పవన్ కళ్యాణ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తానని ఆయన అన్నారు.ఈ కార్యక్రమానికి సహకరించిన సిరిసిల్ల నియోజకవర్గ నాయకులు పెంటాల మహేష్ కు బుర్ర అజయ్ బబ్లు గౌడ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జనసేన సైనికులు మారుతి,శ్రావణ్,సాయి రాజ్,అక్షయ రెడ్డి,జయంత్,నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.