శ్రీ చైతన్య స్కూల్, ఖమ్మం–1 బ్రాంచ్‌లో శనివారం హిందీ దివస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు.హిందీ విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు సాంప్రదాయ నృత్యాలు, ప్రేరణాత్మక గీతాలు,పాత్ర ధారణలు,కథా వివరణలు ప్రదర్శించారు. మీరాబాయి, కబీర్ దాస్,రహీమ్ తదితర కవుల వేషధారణలతో విద్యార్థులు ఆకట్టుకున్నారు.ప్రిన్సిపాల్ రావూరి నివేదిత మాట్లాడుతూ హిందీ ఎలా రాష్ట్ర భాషగా,రాజ్య భాషగా అవతరించిందో తెలిపారు.ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య ఇన్స్టిట్యూట్ చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్,డైరెక్టర్ శ్రీ విద్య,డీజీఎం చేతన్,వైస్ ప్రిన్సిపాల్ యాచమనేని శశాంక్,డీన్ చంద్రశేఖర్, ఇన్‌ఛార్జ్ శ్రీనివాస్,సైదులు బాబు,హిందీ హెచ్.ఓ.డి సలీం,ఆకాష్, రేవతి , హసీనా ఇతర అధ్యాపకులు పాల్గొని విజయవంతం చేశారు.
Post Views: 301