UPDATES  

NEWS

మైనర్,మానసిక రోగి పై అత్యాచారం, వ్యక్తికి 20 సంవత్సరముల కఠిన కారాగార శిక్ష తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కుమారుడి వివాహానికి ఆహ్వానం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) లీగల్,హ్యూమన్ రైట్స్ & ఆర్‌టీఐ విభాగం రాష్ట్ర కన్వీనర్‌గా అడ్వకేట్ మారపాక రమేష్ కుమార్ నియామకం ఘనంగా సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 287వ.జయంతి కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్ నాయక్ ను మర్యాదపూర్వకంగా కలిసిన కార్పొరేటర్ అండ్ బి ఆర్ ఎస్ నాయకులు ధర్మపురి సంజయ్ కి కాంగ్రెస్ పార్టీలో కీలక పదవి కేటాయించాలి ఘోర రోడ్డు ప్రమాదం RTC బస్సు బోల్తా మల్యాల వరద కాలువలో కారు పడిపోవడంతో బీఆర్ఎస్ నాయకుడు తిర్మణి రమణ మృతి రాజన్న సిరిసిల్ల జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ నుండి ప్రభుత్వానికి విజ్ఞప్తి వేములవాడ మున్సిపల్ నూతన పాలకవర్గానికి విప్ ఆది శ్రీనివాస్ శుభాకాంక్షలు

 మైనర్,మానసిక రోగి పై అత్యాచారం, వ్యక్తికి 20 సంవత్సరముల కఠిన కారాగార శిక్ష

కొత్తగూడెం లీగల్:: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి ( ఫోక్సో స్పెషల్ సెషన్స్ జడ్జి) ఎస్.సరిత సోమవారం తీర్పు చెప్పారు. కేసు వివరాలు ఇలా…. బూర్గంపాడు మండలం లక్ష్మీపురం గ్రామము కు చెందిన ఇడ్డీ రంగా తన ఫిర్యాదులో 2019 మార్చి 19 న బూర్గంపాడు పోలీసు వారికి ఇచ్చిన ఫిర్యాదులో తన తమ్ముడు ఇడి భాస్కర్ తన మరదలు అరుణలు మరణించిన కారణంగా వారి మైనర్ పిల్లలు కుమార్తె ,కుమారుడు తన వద్దనే ఉంచుకొని వారి మంచి చెడు చూసుకుంటూ ఉంటున్నారని, తన తమ్ముడి కూతురు మైనరు,మానసిక రోగి యని, తను 19/03/2019 తన ఇంటి నుండి నగదు,బంగారు ,తన సెల్ ఫోను తీసుకొని వెళ్ళినదని తన బంధువులకు సమాచారం ఇచ్చినప్పటికీ ఆమె ఆచూకీ దొరకలేదు.తదుపరి తన తమ్ముడి కుమారుడు రాత్రి సమయంలో ఆటోలో మైనరు బాలిక వెళ్ళిపోయినదని చెప్పగా ఆమె ఆచూకీ తెలుపమని బూర్గంపాడు పోలీస్ వారికి ఫిర్యాదు చేయగా అప్పటి హెడ్ కానిస్టేబుల్ నాగయ్య కేసు నమోదు చేసుకున్నారు. అప్పటి పాల్వంచ డీఎస్పీ జి. మధుసూదన్ రావు దర్యాప్తులో తను మూడు వారాల గర్భవతి అని ఖమ్మం కోర్టు కు నివేదించగా అప్పటి మొదటి అదనపు జిల్లా జడ్జ్ (ఫోక్సో స్పెషల్ సెషన్స్ జడ్జి) వి .బాల భాస్కర్ 2019 జూన్ 11న ప్రెగ్నెన్సీని తీసివేయాలన్న అనుమతి ప్రకారము ఆ మైనర్ యొక్క ప్రెగ్నెన్సీను తీసివేశారు. దర్యాప్తులో సారపాక గాంధీనగర్ కు చెందిన నూనావత్ నవీన్ ఈ అత్యాచారానికి పాల్పడినాడని దర్యాప్తు ఆధారంగా అతనిపై అప్పటి పాల్వంచ డిఎస్పి కె.ఆర్.కె ప్రసాద్ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. కోర్టులో 13 మంది సాక్షులను విచారించారు. కోర్టు లో వాదోపవాదాలు విన్న అనంతరం నూనావత్ నవీన్ పై నేరం రుజువు అయినది. కోర్టు తీర్పు సెక్షన్ 6 ఫోక్స్ యాక్ట్ ప్రకారం 2O సం రాలు కఠిన కారాగార శిక్ష ,రు.5000/- జరిమానా,సెక్షన్ భారత శిక్షా స్మృతి 336(A ) ప్రకారం 10 సంవత్సరముల కఠిన కారాగార శిక్ష ,ఐదువేలు జరిమానా మొత్తం పదివేల రూపాయల జరిమాన చెల్లించని యెడల ఆరు నెలలు కఠినకారా గార శిక్షవిధిస్తూ, రెండు కటిన కారాగారా శిక్షలు ఏకకాలంలో అనుభవించాలని తీర్పు చెప్పారు. అప్పటి స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెలగల నాగిరెడ్డి, ప్రాసిక్యూషన్ నిర్వహించారు. కోర్టు నోడల్ ఆఫీసర్ డి.రాఘవయ్య, కోర్టు లైజాన్ ఆఫీసర్ వీరభద్రం, ( కోర్టు డ్యూటీ ఆఫీసర్) పి.సి.ఎండి అక్రమ్ లు సహకరించారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest