UPDATES  

NEWS

మల్యాల వరద కాలువలో కారు పడిపోవడంతో బీఆర్ఎస్ నాయకుడు తిర్మణి రమణ మృతి రాజన్న సిరిసిల్ల జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ నుండి ప్రభుత్వానికి విజ్ఞప్తి వేములవాడ మున్సిపల్ నూతన పాలకవర్గానికి విప్ ఆది శ్రీనివాస్ శుభాకాంక్షలు కార్పొరేటర్ బత్తుల మధుచంద్ ను ఘనంగా సన్మానించిన మాల మహానాడు జిల్లా యూత్ అధ్యక్షులు వాసుమల్ల.గౌతమ్,తమ్మిశెట్టి ప్రసాద్,సాయి తేజ ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న బండపల్లి సర్పంచ్ ప్రజలకు అప్రమత్తత సూచనలు కరీంనగర్ కార్పొరేషన్ కైవసం చేసుకున్న బిజెపి నిజామాబాద్ మేయర్ గా కూరగాయల ఉమారాణి గెలుపు దిశగా “పల్లపోతు” Kothagudem Govt Polytechnic Wins Overall Boys’ Championship.

 మల్యాల వరద కాలువలో కారు పడిపోవడంతో బీఆర్ఎస్ నాయకుడు తిర్మణి రమణ మృతి

జగిత్యాల, ఫిబ్రవరి 22 (తెలంగాణ వాణి):

పెగడపల్లి మండలం మల్యాల వరద కాలువలో కారు పడిపోవడంతో బీఆర్ఎస్ నాయకుడు తిర్మణి రమణ మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సుద్ధపల్లి గ్రామానికి చెందిన తిర్మణి రమణ అనుమానాస్పద స్థితిలో కారుతో సహా మల్యాల వరద కాలువలో శవమై కనిపించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, కారును బయటకు తీసి పరిశీలించగా అందులో రమణ మృతదేహం లభ్యమైంది.

తిర్మణి రమణ పెగడపల్లి సింగిల్ విండో మాజీ వైస్ చైర్మన్‌గా సేవలందించారు. ఆయన మృతి పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదవశాత్తు జరిగిందా? లేక ఇతర కారణాలున్నాయా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఈ ఘటనతో పెగడపల్లి మండలంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రమణ మృతితో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, పార్టీ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest