కొత్తగూడెం లీగల్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) లీగల్,హ్యూమన్ రైట్స్ & ఆర్‌టీఐ విభాగం రాష్ట్ర కన్వీనర్ గా కొత్తగూడెం పట్టణానికి చెందిన ప్రముఖ న్యాయవాది మారపాక రమేష్ కుమార్ ను నియమిస్తూ రాష్ట్ర చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ సోమవారం నియామకపత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా పొన్నం అశోక్ గౌడ్ మాట్లాడుతూ,న్యాయరంగంలో అనుభవం కలిగిన రమేష్ కుమార్ పార్టీ లీగల్ విభాగాన్ని మరింత బలోపేతం చేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.మానవ హక్కుల పరిరక్షణ,బలహీన వర్గాలకు న్యాయ సహాయం అందించడం మరియు ఆర్‌టీఐ హక్కులపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు.మారపాక రమేష్ కుమార్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు,పార్టీ బలోపేతం కొరకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు.పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ప్రజలకు న్యాయం అందించే దిశగా నిబద్ధతతో పనిచేస్తానని ఈ సందర్భంగా తెలిపారు.ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయవాదులు,రాష్ట్ర టీపీసీసీ సెల్ కన్వీనర్ ఆకుల సత్యనారాయణ మూర్తి,రాజ్ కుమార్ పాల్గొన్నారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టీపీసీసీ లీగల్ సెల్ జిల్లా చైర్మన్ వెల్లంకి వెంకటేశ్వరరావు,పడిసిరి శ్రీనివాస్, న్యాయవాదులు యెర్రా కామేష్,అంబటి రమేష్,ఎర్రపాటి కృష్ణ,సమంత్,వడ్లకొండ హరి తదితరులు అభినందనలు తెలిపారు.