తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ విస్తృత సమావేశాలు (విద్యా సదస్సును) జయప్రదం చేయండి. ప్రాథమిక పాఠశాల చవిటిగూడెంలో తెలంగాణ టిఎస్ యు టి ఎఫ్ రాష్ట్ర విస్తృత సమావేశాలు మరియు విద్యా సదస్సు గోడపత్రిక ను టీఎస్ యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి రాము,అశ్వాపురం మండల అధ్యక్షులు కారం సీతారామయ్య,ప్రధాన కార్యదర్శి ఈ.చందు, ఉపాధ్యక్షులు జి.సునీత ఆవిష్కరించారు.ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి బి.రాము మాట్లాడుతూ…విద్యా సదస్సులో తెలంగాణ విద్యా వ్యవస్థ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యల పై చర్చ, పరిష్కార మార్గాలపై లోతైనవిస్తృత చర్చ, తీర్మానాలు ఉంటాయని అన్నారు.ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి, సమస్యల పరిష్కారం కు ప్రభుత్వ దృష్టికి తీసుకు వెళ్ళనున్నామని తెలిపారు.పెండింగ్ లో ఉన్న ఐదు డిఏలను ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం తక్షణమే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ప్రభుత్వం పి.ఆర్సి .నివేదికను వెంటనే తెప్పించుకుని తాత్సారం చేయకుండా అమలు చేయాలన్నారు. వాస్తవానికి పి.ఆర్సి. అమలు కాలం ముగిసిపోయి రెండు సంవత్సరాలయింది. సీనియర్ ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపి మినాయింపును పొందే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యోగ,ఉపాధ్యాయుల పెండింగ్ బకాయి లను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కావున ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరూ అధిక సంఖ్యలో ఈ రాష్ట్ర విద్యా సదస్సు నందు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో అశ్వాపురం మండల అధ్యక్షులు కారం సీతారామయ్య,ప్రధాన కార్యదర్శి. ఈ. చందు, ఉపాధ్యక్షులు జి.సునీత, తదితరులు పాల్గొన్నారు.