UPDATES  

NEWS

సి.పి.ఎస్ రద్దు చేయాలని ఉపాధ్యాయుల డిమాండ్ తడి చెత్త పొడి చెత్త వేరుగా చేసి ఇస్తున్నా ప్రజలు కొత్తగూడెం మేయర్ బరిలోకి ప్రముఖ విద్యావేత్త డా. యం.వీరనాయక్ తెలంగాణ వాణి దిన పత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఖేడ్ డిఎస్పి వెంకట్ రెడ్డి ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలి: టి పి టి ఎఫ్ మండల అధ్యక్షుడు బి.సుక్య సర్పంచ్ కె.రవి ను సన్మానం చేసిన సొసైటీ వైస్ చైర్మన్ కాంపల్లి కనకేష్‌ కిన్నెరసాని గ్రామపంచాయతీ సర్పంచ్ వజ్జ రామకృష్ణ, ఉపసర్పంచ్ వజ్జా ఇంద్రజ ఆధ్వర్యంలో ముగిసిన క్రికెట్ టోర్నమెంట్ మహిళల కళలకు వేదికగా ముగ్గుల పోటీలు దేశ అభివృద్ధి మోదీ లక్ష్యం- రఘునాధ్

 ఘనంగా 69వ మహాపరినిర్వాణ దివాస్

ధర్మారం (తెలంగాణ వాణి ప్రతినిధి) పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని అంబేద్కర్ కూడలిలో భారత రాజ్యాంగ పితామహుడు సామాజిక సంఘసంస్కర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 69వ పరి నిర్వాణ దివాస్ ను దళిత బహుజన నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ..దేశానికి ఆదర్శ ప్రాయుడు భీమ్రావు అంబేద్కర్ అని ఆయన సేవలను కొనియాడారు. యువత రాజ్యాంగ నిర్మాతను ఆదర్శంగా తీసుకొని సమాజానికి ఉపయోగపడే విధంగా ముందుకు సాగాలన్నారు. సామాజిక న్యాయం కోసం జరిగే సమరశీల పోరాటాలపై చెరగని ముద్ర వేసిన అంబేద్కర్ ఈ దేశ సామాజిక వ్యవస్థ ఆధారంగా నిరూపమాన అధ్యాయనంతో జాతియోద్యమ ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించే రాజ్యాంగాన్ని అందించాడని అన్నారు. అంబేద్కర్ సేవలు ఆలోచనలు మానవ మర్యాద కోసం అంతరాలు లేని సమాజం కోసం దోపిడీపీడనలు లేని వ్యవస్థ నిర్మాణం కోసమనే సృహలు భారతీయ సమాజం కలిగి ఉన్నందు వల్లే ఆయన దూరమై దశాబ్దాలు దాటిన ప్రజలు ఆయన జయంతులు, వర్దాంతు లు జరుపుకుంటున్నారని అన్నారు. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ పై అంబేద్కర్ అభిప్రాయాలు ఏర్పాటు చేసిన ప్రకరణ మూడు తెలంగాణ రాష్ట్ర పోరాటానికి తాత్విక సమర్థతను ఇచ్చాయన్నారు. ఆధునిక భారతీయ పునర్జీవ ఉద్యమ వెలుగుగా కొనసాగిన అంబేద్కర్ చేసిన సేవలు ఘననీయమన్నారు. ప్రజలందరికీ ఓటు హక్కు కల్పించి ప్రజాస్వామ్యంలో అందరూ సమానమేనని నిరూపించారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల జాతీయ నాయకులు బొల్లి స్వామి, మాజీ ఎంపీటీసీ కాంపల్లి చంద్రశేఖర్, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ లు కాడే సూర్యనారాయణ, పాలకుర్తి రాజేశం గౌడ్, నాయకులు దేవి రాజలింగయ్య,మేడవేణి తిరుపతి,ద్యాగేటి ఉదయ్, మాజీ ఎంపీటీసీ తుమ్మల రాంబాబు- మానస, పుస్కూరి రామారావు, సుంచు మల్లేశం, దేవి లావణ్య, బొల్లి నందయ్య, మద్దునాల రాజమల్లు, బొమ్మగాని సతీష్ కుమార్, రామిళ్ళ బాపు, దేవి రాజారాం, నారా ప్రేమ్ సాగర్, కరేటి వేణు, పెరుమాండ్ల ప్రసాద్, రాచమల్ల సత్యనారాయణ, దేవి కిషోర్, దేవి అజయ్, దాసరి శారద, విద్యామారి రాజేందర్, గుండేటి శ్రీనివాస్, గుంటుకు శ్రీనివాస్, సంభోజి రవీందర్, ముల్కాల లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest