UPDATES  

NEWS

మైనర్,మానసిక రోగి పై అత్యాచారం, వ్యక్తికి 20 సంవత్సరముల కఠిన కారాగార శిక్ష తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కుమారుడి వివాహానికి ఆహ్వానం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) లీగల్,హ్యూమన్ రైట్స్ & ఆర్‌టీఐ విభాగం రాష్ట్ర కన్వీనర్‌గా అడ్వకేట్ మారపాక రమేష్ కుమార్ నియామకం ఘనంగా సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 287వ.జయంతి కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్ నాయక్ ను మర్యాదపూర్వకంగా కలిసిన కార్పొరేటర్ అండ్ బి ఆర్ ఎస్ నాయకులు ధర్మపురి సంజయ్ కి కాంగ్రెస్ పార్టీలో కీలక పదవి కేటాయించాలి ఘోర రోడ్డు ప్రమాదం RTC బస్సు బోల్తా మల్యాల వరద కాలువలో కారు పడిపోవడంతో బీఆర్ఎస్ నాయకుడు తిర్మణి రమణ మృతి రాజన్న సిరిసిల్ల జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ నుండి ప్రభుత్వానికి విజ్ఞప్తి వేములవాడ మున్సిపల్ నూతన పాలకవర్గానికి విప్ ఆది శ్రీనివాస్ శుభాకాంక్షలు

 ఘనంగా సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 287వ.జయంతి

ఏన్కూర్ ఫిబ్రవరి 23: సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి ఉత్సవాలను సోమవారం ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాల మూల పోచారంలో ఘనంగా నిర్వహించారు. తొలుత సంత్ శ్రీ సేవాలాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి భోగ్ బండార్ పూజా కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. కార్యక్రమంలో పాఠశాల ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు డిఎస్.నాగేశ్వరరావు పాఠశాల విద్యార్థుల ఉద్దేశించి మాట్లాడుతూ సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ చూపిన మార్గంలో పయనిస్తూ సమాజ అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు జాతిని ఐక్యం చేసి హక్కుల కోసం పాలకులకు వ్యతిరేకంగా పోరాడిన ధీరుడు సేవాలాల్ మహారాజ్ అన్నారు.లంబాడి/బంజార సమాజానికి ఆధ్యాత్మిక గురువు మరియు సంస్కర్తగా గుర్తింపు పొందారన్నారు. బంజార సమాజ ఐక్యత నైతిక విలువలు మరియు సంస్కృతి పరిరక్షణకు ఎంతో కృషి చేశారన్నారు.బాల్యంలోనే ఆయన ఆధ్యాత్మికత పట్ల ఆకర్షితులై తపస్సు మరియు ధ్యానం ద్వారా సమాజ సేవకు అంకితమయ్యారన్నారు. సేవాలాల్ మహారాజ్ బంజారా సమాజంలో ఉన్న మూఢనమ్మకాలను అన్యాయాలను తగ్గించేందుకు కృషి చేశారన్నారు. బంజార జాతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటేలా అహింసా సిద్ధాంతాలతో పునాదులు వేశారన్నారు.అలాగే బోగ్ బండార్ పూజారి, తెలంగాణ గోర్ బంజార ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు బి.శోభన్ నాయక్ మాట్లాడుతూ సంత్ సేవా లాల్ మహరాజ్ కేవలం గిరిజన ఆరాధ్య దైవం మాత్రమే కాదని అందరికీ ఆరాధ్యుడు అన్నాడు. హైందవ ధర్మం గొప్పతనం విశిష్టతను తెలియజేయడానికి సేవలాల్ మహారాజ్ జన్మించినట్లు చరిత్రకారులు చెబుతార న్నారు.సేవాలాల్ మహారాజ్ ను ఆదర్శంగా తీసుకొని వారి అడుగుజాడల్లో నడవాలని విద్యార్థులను కోరారు.కార్యక్రమంలో డిప్యూటీ వార్డెన్ బి.రవి, పాఠశాల ఉపాధ్యాయులు బి. రవి, బి.సింగ్యా,వి.రమేష్, జే. నాగేశ్వరరావు, ఎం. చందర్రావు పి.శ్రీనివాస్, ఎ. సుస్మిత, బి.శారద బాయి, టి.హరియా నాయక్, డి.ఉషశ్రీ, టి.సౌందర్య, కపూర్య, మీరు నాయక్, కళ్యాణి, సుగుణ మరియు పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest