UPDATES  

 గణపతి మండపంలో ఘనంగా కుంకుమార్చన…

ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా కుంకుమార్చన

హుజరాబాద్ ఆగస్టు 29 తెలంగాణ వాణి:

మండలంలోని రాంపూర్ కొత్తదయా నగర్ కాలనీలో ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ప్రతిష్టించిన గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా గణపతి మండపంలో కుంకుమార్చన నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాలనీ మహిళలు అధిక సంఖ్యలో విచ్చేసి గణపతి సన్నిధిలో కుంకుమార్చన లో పాల్గొన్నారు ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో పురోహితులు చేరాలా హరికృష్ణ ఈ కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు

కుంకుమార్చన అంటే దేవతామూర్తుల నామాలను జపిస్తూ కుంకుమను సమర్పించడం, ముఖ్యంగా స్త్రీలకు మరియు అమ్మవారి అనుగ్రహం సిద్ధిస్తాయని నమ్మకం. నవరాత్రులు వంటి ప్రత్యేక పర్వదినాలలో ఈ పూజ చేయడం వల్ల కోటిరెట్లు అధిక ఫలితం లభిస్తుందని, ఇది భక్తి శ్రద్ధతో ఆచరించినవారికి అనుభవపూర్వకంగా తెలుస్తుందని చెబుతారు.అమ్మవారికి కుంకుమను సమర్పించడం ద్వారా ఆమె ప్రసన్నురాలవుతుందని, కోరిన వరాలను ప్రసాదిస్తుందని విశ్వసిస్తారు.హిందూ సంప్రదాయంలో కుంకుమను శుభానికి, సౌభాగ్యానికి చిహ్నంగా భావిస్తారు. కాబట్టి కుంకుమార్చన చేయడం ద్వారా సౌభాగ్యం సిద్ధిస్తుందని నమ్మకం. మామూలు రోజుల కంటే నవరాత్రి పర్వదినాలలో కుంకుమార్చన చేయడం వల్ల అధిక ఫలితాలు లభిస్తాయి. ప్రధానంగా అమ్మవారిని పూజించినా, ఇతర దేవతామూర్తులకు కూడా వారి నామాలను జపిస్తూ కుంకుమార్చన చేయవచ్చునీ భక్తుల నమ్మకం.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest