కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి
దాస్యం వినయ్ భాస్కర్ మంత్రి కావాలి
తెలంగాణ ఉద్యమకారుడు చాగంటి రమేష్
అయ్యప్ప మాల విరమణలో భాగంగా శబరిమలలో పాదయాత్ర
తెలంగాణ వాణి, ఉమ్మడి వరంగల్ బ్యూరో,(జనవరి 05) : తెలంగాణ ఉద్యమకారుడు,వరంగల్ పశ్చిమ నియోజవర్గానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు చాగంటి రమేష్ తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్ పై అభిమానాన్ని చాటుకున్నారు.అయ్యప్ప స్వామి మాల ధరించి 101 రోజు పూర్తి అయినా సందర్భంగా ఇరుముడితో శబరిమలై బయలుదేరారు.పంబా నుంచి అయ్యప్ప సన్నిధానం వరకు చిన్న పాదంతో వెళుతున్న మార్గంలో తెలంగాణ రాష్ట్రా నికి మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని, వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో మళ్లీ భారీ మెజారితో దాస్యం వినయ భాస్కర్ గారు గెలుపొంది తెలంగాణ రాష్ట్రానికి మంత్రి కావాలని ఆకాంక్షిస్తూ నెత్తిన ఇరుముడితో చేతిలో ఫ్లెక్సీ తో ఇరుముడి సమర్పించేందుకు వెళ్లారు.పంబా నుంచి అయ్యప్ప సన్నిధానం వరకు చేరుకొని మొక్కలు తీర్చుకున్నారు.ఈ కార్యక్రమంలో రుద్రోజ్ సంపత్, పలువురు అయ్యప్ప స్వాములు ఉన్నారు.