కిన్నెరసాని గ్రామపంచాయతీ పరిధిలో కొమరం భీమ్ క్రికెట్ టోర్నమెంట్ – సీజన్ 3 ను దివంగత వజ్జ విద్యాసాగర్ జ్ఞాపకార్థం ఘనంగా నిర్వహించారు. ఈ టోర్నమెంట్‌ను కిన్నెరసాని గ్రామపంచాయతీ సర్పంచ్ వజ్జ రామకృష్ణ, ఉపసర్పంచ్ వజ్జా ఇంద్రజ ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించారు. ఈ టోర్నమెంట్ లో కిన్నెరసాని క్రికెట్ టీం మెంబెర్స్ ఉత్సాహంగా ఆడి అలరించారు.ఈ కార్యక్రమంలో బొర్ర ఉదయ్,షేక్ ఆరిఫ్,వజ్రా వినయ్,పడిగా లోకేష్ తదితరులు పాల్గొని టోర్నమెంట్‌కు విశేష సహకారం అందించారు. గ్రామ యువత క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించేలా ఈ పోటీలు ఉత్సాహంగా కొనసాగాయి.
Post Views: 20
