UPDATES  

NEWS

కాజీపేటలో అట్టహాసంగా ముగిసిన 58వ జాతీయ సీనియర్ ఖోఖో ఛాంపియన్‌షిప్ క్రీకెట్ టోర్నమెంట్ పోస్టర్ ను ఆవిష్కరించిన లక్ష్మీదేవి పల్లి ఎస్ ఐ రమణ రెడ్డి ప్రభుత్వ భూముల్లో ఆక్రమణల కూల్చివేత కిన్నెరసాని క్రీడా పాఠశాలలో నల్ల బ్యాడ్జిలతో నిరసన మధ్యాహ్న భోజన వంట కార్మికులకు ఆరోగ్య పరీక్షలు.  తడ్కల్ లో శ్రీ జగద్గురు తుకారాం మహారాజ్ ఘథా పూజ పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశుగర్భశోక, పరీక్ష చికిత్స శిబిరం అర్బన్ ఎమ్మెల్యేతో కలిసి సీఎం కప్ టార్చ్ రిలే ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్ ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ లో సీపీ టీం ఘన విజయం తల్లిదండ్రుల పిర్యాదు మేరకు కస్తూర్బా పాఠశాలను తనిఖీ చేసిన మాజీ ఎమ్మెల్యే

 కాజీపేటలో అట్టహాసంగా ముగిసిన 58వ జాతీయ సీనియర్ ఖోఖో ఛాంపియన్‌షిప్

 

● అధ్యక్షులు జంగా రాఘవరెడ్డి సారథ్యంలో క్రీడాకారులకు అంతర్జాతీయ స్థాయి వసతులు.

కాజీపేట్:జనవరి15 (తెలంగాణ వాణి టౌన్)

​తెలంగాణ ఖోఖో అసోసియేషన్ అధ్యక్షులు జంగా రాఘవరెడ్డి సారథ్యంలో కాజీపేట వేదికగా ఐదు రోజుల పాటు సాగిన 58వ జాతీయ స్థాయి సీనియర్స్ ఖోఖో పోటీలు గురువారం సాయంత్రం అత్యంత వైభవంగా ముగిశాయి. దేశంలో మునుపెన్నడూ లేని విధంగా అత్యాధునిక హంగులు మరియు సకల సౌకర్యాలతో ఈ ఛాంపియన్‌షిప్‌ను నిర్వహించడం విశేషం. క్రీడాకారులకు అవసరమైన భోజనం, వసతితో పాటు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మ్యాట్ కోర్టుల ఏర్పాటును జంగా రాఘవరెడ్డి స్వయంగా పర్యవేక్షించి, ఎక్కడా లోటు లేకుండా విజయవంతం చేశారు. ఈ అద్భుతమైన ఏర్పాట్లపై దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన క్రీడాకారులు, అసోసియేషన్ ప్రతినిధులు ప్రశంసల వర్షం కురిపించారు.

​పోటీల ఫలితాల విషయానికి వస్తే, పురుషుల విభాగంలో రైల్వేస్ జట్టు తన ఆధిపత్యాన్ని చాటుకుని విజేతగా నిలవగా, మహారాష్ట్ర రన్నరప్‌తో సరిపెట్టుకుంది. కొల్హాపూర్ మరియు ఒడిషా జట్లు వరుసగా మూడు, నాలుగు స్థానాలను దక్కించుకున్నాయి. ఇక మహిళల విభాగంలో మహారాష్ట్ర జట్టు అద్భుత ప్రదర్శనతో టైటిల్‌ను కైవసం చేసుకోగా ఒడిషా జట్టు రన్నరప్‌గా నిలిచింది. ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా మరియు ఢిల్లీ జట్లు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. గెలుపొందిన జట్లకు మరియు క్రీడాకారులకు ఘనంగా ట్రోఫీలు,వ్యక్తిగత మెడల్స్ మరియు సర్టిఫికేట్లను అందజేయడంతో ఈ క్రీడా సంబరం ముగిసింది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest