UPDATES  

NEWS

గిరిజన సంక్షేమ శాఖ ఏడీ సర్వేశ్వర రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఐటిడిఎ గిరిజన సంక్షేమ శాఖ ఉమ్మడి జిల్లాల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టీ.మధుకర్. జనవాసులకు దూరంగా వైన్ షాపు నిర్వహించాలి మున్సిపల్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారుల ఆకస్మిక తనిఖీలు మహాత్మ జ్యోతిరావు పూలే కు 135వ ఘన నివాళి కాపర్ వైర్ దొంగల పట్టివేత కోర్టుకు అప్పగింత ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు బొమ్మరెడ్డిపల్లి లో టీబి ఛాంపియన్ అవగాహన కార్యక్రమం మంత్రులను మర్యాదపూర్వకంగా కలిసిన పెరిక కుల రాష్ట్ర నాయకులు బొమ్మరెడ్డి పల్లిలో ఉచిత ఆరోగ్య శిబిరం అనుమతులు లేని ఆసుపత్రులపై ఆగ్రహం వ్యక్తం చేసిన డిఎంహెచ్ఓ

 ఆటో కార్మికులను ఆగం చేసిన కాంగ్రెస్ – దాస్యం వినయ్ భాస్కర్

  • ఖాజీపేట రైల్వే స్టేషన్ ఆటోయూనియన్ ఆధ్వర్యంలో కార్యక్రమం….
  • బాకీ కార్డులను విడుదల చేసిన మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్

 తెలంగాణ వాణి,ఉమ్మడి వరంగల్ బ్యూరో, (అక్టోబర్ 8) : కాంగ్రెస్ నాయకులను ఎక్కడపడితే అక్కడ నిలదీయాలని ప్రభుత్వ మాజీ చీప్ విప్ ,బి ఆర్ ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు.హనుమకొండ లోని కాజీపేట రైల్వే స్టేషన్ వద్ద ఆటో డ్రైవర్ల యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై బాకీ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులను ఎక్కడపడితే అక్కడ నిలదీయాలని కాంగ్రెస్ పార్టీ అమలు గాని హామీలతో గద్దెనెక్కి అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణను సాధించి 14 ఏళ్ల పాటు తెలంగాణ అంతట తిరిగి ప్రజల కష్ట సుఖాలను తెలుసుకొని తెలంగాణను సాధించి పదేళ్లపాటు సంక్షేమం, అభివృద్ధితో కెసిఆర్ పాలన చేస్తే దేశం మొత్తం కూడా తెలంగాణ వైపు చూసిందని అన్నారు. రాజ్యాంగంలో పొందుపరిచిన విధంగా విద్యా,ఉద్యోగ, ఉపాధి రంగాలలో ఎవరు ఊహించని రీతిలో అభివృద్ధి సాధించిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు కాని హామీలతో ఎన్నికల సమయంలో క్యారెంటీ కార్డు అని ఆరు గ్యారెంటీలు 420 హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలకు అనేక హామీలు ఇచ్చి ఏ వర్గం ప్రజలను కూడా సంతృప్తి పరచలేదన్నారు. ఈ వర్గాలకైతే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందో ఆ వర్గం ప్రజలు తిరుగుబాటు చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని అడిగితే బి ఆర్ ఎస్ పార్టీ నాయకులపై, కార్యకర్తలపై అనేక కేసులు పెడుతూ చిత్రహింసలకు గురి చేస్తుందన్నారు.టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలకు కేసులు కొత్త కాదని, కేసులకు భయపడేది లేదన్నారు. కేంద్రంలో ఉన్నటువంటి బిజెపి, కాంగ్రెస్ తో మీలాఖత్ అయి రాష్ట్రాన్ని అన్ని రంగాలను దెబ్బతీస్తుందన్నారు. గ్యారెంటీలలో ఆటో కార్మికులకు రూ.1000, వితంతువులకు రూ. 2500, వికలాంగులకు రూ.6000, విద్యార్థులకు స్కూటీలు ఇస్తానని మభ్యపెట్టి, గద్దెనకినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో కార్మికుల బతుకులలో చిందర వందర చేసిందని అన్నారు. అనేక మంది ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని, దానికి కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యత వహించాలని అన్నారు. పాలన అంతా కూడా రివర్స్ గేర్ లో జరుగుతుందని, ప్రతి కార్యకర్తలు ఆటో కార్మికుని కాపాడుకుంటానని, కేసులకు భయపడేది లేదని కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే అన్ని హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest