UPDATES  

NEWS

 సృజన టెక్ ఫెస్ట్ 2025–26 విజేతలకు ఘన సన్మానం:ప్రిన్సిపాల్ బండి శ్రీనివాస్,

GPW సికింద్రాబాద్ మరియు JNGPT రామంతాపూర్‌లో నిర్వహించిన సృజన టెక్ ఫెస్ట్ 2025–26 రాష్ట్రస్థాయి పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులను ప్రభుత్వ పాలిటెక్నిక్, కొత్తగూడెంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ బండి శ్రీనివాస్,విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొని విజేతలతో పాటు వారి తల్లిదండ్రులను సన్మానించి అభినందించారు.సివిల్ ఇంజినీరింగ్ విభాగం “స్మార్ట్ అండ్ సస్టైనబుల్ ఇన్నోవేషన్ ఇన్ సివిల్ ఇంజినీరింగ్” అంశంపై మౌలిక వసతుల సమస్యలకు స్మార్ట్, స్థిరమైన పరిష్కారాలను ప్రదర్శించగా, మెకానికల్ ఇంజినీరింగ్ విభాగం “స్మార్ట్ అండ్ సస్టైనబుల్ క్రాప్ మేనేజ్‌మెంట్” అంశంపై వ్యవసాయ రంగానికి సంబంధించిన వినూత్న ఆలోచనలను ఆవిష్కరించింది.ఈ విజయానికి మార్గదర్శకులుగా నిలిచిన సివిల్ ఇంజినీరింగ్ విభాగపు లెక్చరర్ జె. హరికృష్ణ, మెకానికల్ ఇంజినీరింగ్ విభాగపు సీనియర్ లెక్చరర్ కె.టి. రఘురాం సేవలను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ బండి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఇలాంటి వేదికలు విద్యార్థుల సాంకేతిక నైపుణ్యాల పెంపొందనకు దోహదపడతాయని తెలిపారు

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9703247143
telanganavanidaily.com
Date of Publish : 31 March 2026, 10:46 pm Posted by : TELANGANA VANI

సృజన టెక్ ఫెస్ట్ 2025–26 విజేతలకు ఘన సన్మానం:ప్రిన్సిపాల్ బండి శ్రీనివాస్,

GPW సికింద్రాబాద్ మరియు JNGPT రామంతాపూర్‌లో నిర్వహించిన సృజన టెక్ ఫెస్ట్ 2025–26 రాష్ట్రస్థాయి పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులను ప్రభుత్వ పాలిటెక్నిక్, కొత్తగూడెంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ బండి శ్రీనివాస్,విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొని విజేతలతో పాటు వారి తల్లిదండ్రులను సన్మానించి అభినందించారు.సివిల్ ఇంజినీరింగ్ విభాగం “స్మార్ట్ అండ్ సస్టైనబుల్ ఇన్నోవేషన్ ఇన్ సివిల్ ఇంజినీరింగ్” అంశంపై మౌలిక వసతుల సమస్యలకు స్మార్ట్, స్థిరమైన పరిష్కారాలను ప్రదర్శించగా, మెకానికల్ ఇంజినీరింగ్ విభాగం “స్మార్ట్ అండ్ సస్టైనబుల్ క్రాప్ మేనేజ్‌మెంట్” అంశంపై వ్యవసాయ రంగానికి సంబంధించిన వినూత్న ఆలోచనలను ఆవిష్కరించింది.ఈ విజయానికి మార్గదర్శకులుగా నిలిచిన సివిల్ ఇంజినీరింగ్ విభాగపు లెక్చరర్ జె. హరికృష్ణ, మెకానికల్ ఇంజినీరింగ్ విభాగపు సీనియర్ లెక్చరర్ కె.టి. రఘురాం సేవలను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ బండి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఇలాంటి వేదికలు విద్యార్థుల సాంకేతిక నైపుణ్యాల పెంపొందనకు దోహదపడతాయని తెలిపారు

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest