కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
తెలంగాణ వాణి ఆర్ సి ఇంచార్జ్, మే 31,వేములవాడ
అర్హులైన రైతులకు ఈ ఆదివారం రోజున వేములవాడ తిప్పాపూర్ శ్రీ రాజరాజేశ్వర స్వామి గోశాల లోని 300 కోడె పిల్లలను సాయంత్రం 3 గంటల నుండి పంపిణీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా శనివారం రోజున ఒక ప్రకటనలో తెలిపారు.పట్టాదార్ పాస్ బుక్ కలిగిన అర్హులైన రైతులకు మాత్రమే జియో ట్యాగింగ్ కలిగి ఉన్న చిన్న కోడె పిల్లలను పంపిణీ చేయనున్నామని స్పష్టం చేశారు.అర్హులైన రైతులు సంబంధిత పట్టాదారు పాస్ బుక్, ఆధార్ కార్డు తదితర పత్రాలతో గోశాలకు రావాలని, కోడె పిల్లలను పొందిన రైతులు వాటి సంరక్షణను సక్రమంగా చూసుకోవాలని కలెక్టర్ సూచించారు.
Post Views: 70