UPDATES  

NEWS

జనగామ జిల్లా కలెక్టర్ తీరుపై జర్నలిస్ట్ నాయకుల ఫిర్యాదు పచ్చని ఔషధ మొక్కలు అందజేసి ఆశీర్వాదం పొందిన చిన్నారి అఫాన్ జైదీ సర్పంచ్ జర్పల దేవి ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం రోడ్డెక్కిన అన్నదాతలు వైన్స్ సిట్టింగ్ రూమ్ లో వ్యక్తి మృతి రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం… సరైన రోడ్డు సౌకర్యం లేకా వర్ష కాలం వస్తే రైతులకు కష్టాలే… ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి: గిరిజన సంక్షేమ సంఘం నాయకులు రాంబాబు,ఎంపీ నాయక్ ఉపాధి హామీ కూలీల ప్రాణం తీసుకున్న అతివేగం లక్ష్మీదేవి పల్లి మండలంలో వడదెబ్బకు వ్యవసాయ కూలీ మహిళా మృతి

 రోడ్డు ప్రమాదంలో మహిళా ఎస్సై శ్వేత మృతి

జగిత్యాల (తెలంగాణ వాణి)

 

జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం చిల్వాకోడూరు వద్ద కారు, ద్విచక్ర వాహనం ఢీకొన్న ప్రమాదంలో జగిత్యాల జిల్లా పోలీస్‌ డీసీఆర్‌బీలో పని చేస్తున్న ఎస్‌ఐ శ్వేతతో పాటు ద్విచక్రవాహనంపై ఉన్న వాహనదారుడు దుర్మరణం చెందారు. ధర్మారం నుంచి జగిత్యాలకు వస్తున్న ఎస్‌ఐ శ్వేత ముందుగా వస్తున్న ద్విచక్రవాహనం రెండు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు ఇద్దరు మృతి చెందారు. కారు అతి వేగంగా ఉండటంతో ప్రమాదం తర్వాత కారు రోడ్డుకు కిందికి దూసుకెళ్లింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. డీసీఆర్‌బీ జగిత్యాలలో పని చేస్తున్న ఎస్‌ఐ శ్వేత. గతంలో కోరుట్ల, వెల్గటూరు, కథలాపూర్‌, పెగడపల్లి ఎస్‌ఐగా పని చేశారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest