UPDATES  

 రక్తదానానికి యువత ముందుకు రావాలి: డీఎస్పీ ఆదినారాయణ

కొత్తగూడెం ఏరియా హాస్పిటల్‌లో యంగ్ ఇండియన్ బ్లడ్ డోనర్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు జె. బాలు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని డీఎస్పీ ఆదినారాయణ ప్రారంభించి, యువత రక్తదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.రక్తదానం ద్వారా ప్రాణాలు కాపాడవచ్చని,ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చని తెలిపారు.జె. బాలు మాట్లాడుతూ ఇప్పటివరకు 46,500 మందికి రక్తం అందించామని,ప్రతి ఇంటి నుంచి ఒక రక్తదాత ఉండేలా లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు.ఈ శిబిరంలో 37 మంది రక్తదానం చేశారు.ఈ కార్యక్రమంలో సి.ఐ. ఇంద్రసేనారెడ్డి, డాక్టర్ ప్రవీణ్ రెడ్డి, వీరునాయక్, భరత్, రాజేష్, జుబ్బు, జయశ్రీ, కమలారాణి తదితరులు పాల్గొన్నారు.

Date of Publish : 27 March 2026, 10:06 pm Posted by : TELANGANA VANI

రక్తదానానికి యువత ముందుకు రావాలి: డీఎస్పీ ఆదినారాయణ

కొత్తగూడెం ఏరియా హాస్పిటల్‌లో యంగ్ ఇండియన్ బ్లడ్ డోనర్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు జె. బాలు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని డీఎస్పీ ఆదినారాయణ ప్రారంభించి, యువత రక్తదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.రక్తదానం ద్వారా ప్రాణాలు కాపాడవచ్చని,ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చని తెలిపారు.జె. బాలు మాట్లాడుతూ ఇప్పటివరకు 46,500 మందికి రక్తం అందించామని,ప్రతి ఇంటి నుంచి ఒక రక్తదాత ఉండేలా లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు.ఈ శిబిరంలో 37 మంది రక్తదానం చేశారు.ఈ కార్యక్రమంలో సి.ఐ. ఇంద్రసేనారెడ్డి, డాక్టర్ ప్రవీణ్ రెడ్డి, వీరునాయక్, భరత్, రాజేష్, జుబ్బు, జయశ్రీ, కమలారాణి తదితరులు పాల్గొన్నారు.

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest