కొత్తగూడెం సోమవారం సాయంత్రం బోడగుట్టకు చెందిన ఖలీల్ పాషా బస్టాండ్ సమీపంలోని ఆర్టీసీ బంక్ వద్ద జరిగిన ద్విచక్రవాహన ప్రమాదంలో తీవ్ర గాయాల పాలయ్యాడు.అదే సమయంలో ఆ మార్గంలో వెళ్తున్న ట్రాఫిక్ ఎస్సై గడ్డం ప్రవీణ్ కుమార్ తక్షణమే స్పందించారు. గాయపడిన ఖలీల్ పాషా ను తన వాహనంలోనే ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స చేయించడంతో పాటు,వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మానవత్వంతో స్పందించి సహాయం చేసిన ఎస్సై ప్రవీణ్ కుమార్‌ను ఖలీల్ కుటుంబ సభ్యులు మాత్రమే కాకుండా ఘటన స్థలంలో ఉన్న ప్రజలంతా అభినందించారు.
Post Views: 175



