UPDATES  

 బతుకమ్మ పండుగ నిర్వాహణ లో కాంగ్రెస్ విఫలం

తెలంగాణ వాణి, ఉమ్మడి వరంగల్ బ్యూరో, (సెప్టెంబర్ 28 ) : బతుకమ్మ వేడుకలను నిర్వహించడంలో కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా విఫలమైందని ప్ర‌భుత్వ మాజీ చీఫ్ విప్‌,బిఆర్ఎస్ పార్టీ హ‌నుమ‌కొండ జిల్లా అధ్య‌క్షులు దాస్యం విన‌య్ భాస్క‌ర్ అన్నారు. భార‌త రాష్ట్ర స‌మితి పార్టీ హ‌నుమ‌కొండ జిల్లా ఆధ్వ‌ర్యంలో బ‌తుక‌మ్మ వేడుక‌ల‌ను ఆదివారం రోజున ప్ర‌భుత్వ మాజీ చీఫ్ విప్‌, బీఆర్ఎస్ పార్టీ హ‌నుమ‌కొండ జిల్లా అధ్య‌క్షులు దాస్యం విన‌య్ భాస్కర్ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించారు.బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ తెలంగాణ పండుగ‌లు తెల్వ‌ని దుస్థితి కాంగ్రెస్ ది అని,బ‌తుక‌మ్మ పండుగ ఏర్పాట్లు చేయ‌డంలో కాంగ్రెస్ పార్టీ విఫ‌ల‌మైందన్నారు.తెలంగాణ‌లోని ఏ ప‌ల్లెలోనూ మ‌న నేల అస్తిత్వ‌మైన బ‌తుక‌మ్మ పండుగ నిర్వ‌హ‌ణ కు సరైన ఏర్పాట్లు క‌ల్పించ‌లేదన్నారు.బీఆర్ఎస్ శ్రేణులు స్వ‌చ్ఛందంగా బ‌తుక‌మ్మ పండుగ నిర్వ‌హ‌ణ కోసం ఏర్పాట్లు చేస్తున్నారని,తెలంగాణ‌లోని ఏ పండుగ‌ను,ప్ర‌జ‌ల విశ్వాసాల‌కు కాంగ్రెస్ పార్టీ విలువ‌ను, ప్రాముఖ్య‌త‌ను ఇవ్వ‌డం లేదన్నారు.తెలంగాణ‌లోని అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను విస్మ‌రించి, ఇబ్బందుల‌కు గురి చేస్తున్న ఘ‌న‌త కాంగ్రెస్ పార్టీకి ద‌క్కుతుందన్నారు.మాజీ మంత్రివ‌ర్యులు స‌త్య‌వ‌తి రాథోడ్ మాట్లాడుతూ కేసీఆర్ హ‌యాంలో అన్ని వ‌ర్గాలు సంతోషంగా ఉన్నాయన్నారు.తెలంగాణ ప్ర‌జ‌లు సుఖ‌సంతోషాల‌తో పాటు కేసీఆర్ కానుక‌ల‌తో పండుగ‌లు నిర్వ‌హించుకునే వారని,అన్ని మ‌తాల‌కు, అన్ని కులాల‌కు,తెలంగాణ అస్తిత్వాల‌ను మ‌రువ‌ని నేత కేసీఆర్ అన్నారు.స‌బ్బండ వ‌ర్గాల‌కు సంక్షేమ ప‌థ‌కాలు అందించిన ఘ‌న‌త కేసీఆర్ కే ద‌క్కుతుందన్నారు.ప‌ది ఏండ్ల పాల‌న‌లో దేశంలోనే తెలంగాణ అగ్ర‌గామిగా నిలిచిందన్నారు.బీసీ, ఎస్టీ, ఎస్సీ వ‌ర్గాల‌కు ఆత్మ‌గౌర‌వ భ‌వ‌నాలు,వారి అభివృద్ధికి ప్ర‌త్యేక నిధులు కేటాయించిన ఘ‌న‌త కేసీఆర్ కే ద‌క్కుతుందన్నారు.మాజీ డెప్యూటీ స్పీక‌ర్ ప‌ద్మాదేవేంద‌ర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ స‌ర్కారు అన్ని వ‌ర్గాల‌ను మోసం చేసిందని,తెలంగాణ ఉద్య‌మంలో భాగ‌మైన బ‌తుక‌మ్మ పండ‌గ నిర్వ‌హ‌ణ‌లోనూ కాంగ్రెస్ ప్ర‌భుత్వం విఫ‌ల‌మైందన్నారు.బి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఘ‌నంగా బ‌తుక‌మ్మ వేడుక‌లు నిర్వ‌హించ‌డం జ‌రుగుతోందని,ప్ర‌సిద్ధి గాంచిన హ‌నుమ‌కొండ జిల్లా నేడు ఘ‌నంగా బ‌తుక‌మ్మ వేడుక‌ల‌ను నిర్వ‌హించ‌డం జ‌రిగిందన్నారు.మ‌హిళ‌లు ఆత్మ‌గౌర‌వంతో పాల్గొనాల్సిన పండుగ‌లో అసౌక‌ర్యానికి గుర‌వుతున్నారన్నారు.కేసీఆర్ హ‌యాంలో బ‌తుక‌మ్మ పండుగ‌కు చీర‌లు ఇస్తే కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఎన్నిక‌ల స‌మ‌యంలోనే ప్ర‌జ‌లు గుర్తుకొచ్చి కంటి తుడుపుగా కానుక‌లు ఇస్తున్నారన్నారు.ఇప్పటికే గ్రామాల్లో రైతులు యూరియా దొర‌క‌క అవ‌స్థ‌లు ప‌డుతున్నారని,రెండేళ్ల కాంగ్రెస్ పాల‌న‌లో అన్ని వ‌ర్గాలు న‌ష్ట‌పోయాయన్నారు.ప్ర‌భుత్వ మాజీ విప్ గొంగ‌డి సునీత మాట్లాడుతూ బ‌తుకునిచ్చే బ‌తుక‌మ్మ పండుగ ప‌ట్ట‌ని ప్ర‌భుత్వం కాంగ్రెస్ ప్ర‌భుత్వం అని,6 గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చి రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను, ముఖ్యంగా మ‌హిళ‌ల‌ను కాంగ్రెస్ ప్ర‌భుత్వం మోసం చేసిందన్నారు.మ‌హిళ‌ల‌కు ఇస్తామ‌న్నా 2500, తుల బంగారం,విద్యార్థినుల‌కు స్కూటీలు, స్కాల‌ర్ షిప్‌లు, కోటీశ్వ‌ర్లు చేస్తామ‌న్న హామీల‌న్నీ కాంగ్రెస్ మ‌రిచిందన్నారు.2 ల‌క్ష‌ల ఉద్యోగాలు , జాబ్ క్యాలెండ‌ర్‌ను మ‌రిచి నిరుద్యోగుల‌ను ఈ కాంగ్రెస్ మోసం చేసిందన్నారు.ప్ర‌జా పాల‌న అన్నారు కానీ ప్ర‌జా వ్య‌తిరేక పాల‌న ను కొన‌సాగిస్తోందన్నారు.బీఆర్ఎస్ పార్టీ మ‌హిళా విభాగం మాజీ రాష్ట్ర అధ్య‌క్షురాలు,క‌రీంన‌గ‌ర్ మాజీ జెడ్పీ చైర్మ‌న్ తుల ఉమ మాట్లాడుతూ
కాంగ్రెస్ నిర్బంధాల పాల‌న కొన‌సాగిస్తోందన్నారు.ప్ర‌శ్నించే శ‌క్తుల‌ను కేసుల పేరుతో వేధిస్తోందని,తెలంగాణ గ‌డ్డే పోరాటాల గ‌డ్డ‌ అని,రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ప్ర‌జ‌లే బుద్ధి చెబుతారన్నారు.రెండేళ్ల కాంగ్రెస్ పాల‌న లో కూల్చివేత‌లు,ఎగ‌వేత‌లు, కోత‌లే త‌ప్ప సంక్షేమం – అబ్ధివృద్ధి క‌న‌బ‌డ‌డం లేదన్నారు.మ‌హిళ‌లు పెద్ద ఎత్తున బ‌తుక‌మ్మ‌ల‌ను పేర్చి సంతోషంగా బ‌తుక‌మ్మ ఆడారు.గౌర‌మ్మ‌ల‌ను చేసి బ‌తుక‌మ్మ‌పై ఉంచి భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో కొలిచారు. వివిధ బతుకమ్మ పాటలకు,తెలంగాణ ఉద్య‌మం పాట‌లు, కేసీఆర్‌,బీఆర్ఎస్ పార్టీ పాట‌లకు ఆడ‌బిడ్డ‌లు కాళ్లు క‌దిపారు.ఆడి పాడారు.బ‌తుకమ్మ ఆడిన ఆడ‌బిడ్డ‌ల‌కు భోజ‌నాలు పెట్టారు. బ‌తుక‌మ్మ కానుక‌గా చీర‌లు పంచిపెట్టారు.రాష్ట్ర మ‌హిళా నేత‌లు సుశీలా రెడ్డి, సుమిత్రా ఆనంద్‌, రేణుక‌, పావ‌ని గౌడ్‌, ర‌జితా రెడ్డి,మ‌హిళా నేత‌లు పెద్ది స్వ‌ప్న‌, ఎల్లావుల ల‌లీతా యాద‌వ్‌, డా. హ‌రి ర‌మాదేవి, దాస్యం వినయ్ భాస్క‌ర్ స‌తీమ‌ణి రేవ‌తీ భాస్క‌ర్‌, దాస్యం విజ‌య్ భాస్క‌ర్ స‌తీమ‌ణి శిరీష‌,జీడ‌బ్ల్యూఎంసీ డిప్యూటీ మేయ‌ర్‌ రిజ్వానా మ‌సూద్‌, కార్పొరేట‌ర్ న‌ల్ల స్వ‌రూపారాణి,ఇమ్మ‌డి లోహితా రాజు, నాయ‌కులు దాస్యం విజ‌య్ భాస్క‌ర్‌,కార్పొరేట‌ర్ సంకు న‌ర్సింగ్ రావు, మాజీ కార్పొరేట‌ర్ జోరిక రమేష్‌, కుసుమ ల‌క్ష్మీనారాయ‌ణ‌,మేక‌ల బాబు రావు, ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గ కో ఆర్డినేట‌ర్ పులి ర‌జినీ కాంత్‌,క‌మురున్నీసాబేగం,న‌యీమొద్దీన్‌, బీఆర్ఎస్ పార్టీ మ‌హిళా విభాగం డివిజన్ అధ్య‌క్షురాళ్లు,పార్టీ డివిజ‌న్ అధ్య‌క్షులు, హ‌నుమ‌కొండ జిల్లా ముఖ్య నాయ‌కులు, ప‌శ్చిమ గులాబీ శ్రేణులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest