UPDATES  

NEWS

సాంకేతిక విజ్ఞానానికి వారధి… హుస్నాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్! కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి హ్యాండ్ బోర్ మరమ్మతు – ప్రజల సమస్యకు తక్షణ పరిష్కారం:కార్పొరేటర్ కళావతిధనరాజ్ కాంగ్రెస్ నాయకులకు కాకులమర్రి లక్ష్మణ్ బాబు భయం పట్టుకుంది అంగన్‌వాడీల్లో ఒంటిపూట బడి అమలు పట్ల హర్షం వ్యక్తం చేసిన విద్యా పరిరక్షణ కమిటీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు హరిలాల్ నాయక్  సృజన టెక్ ఫెస్ట్ 2025–26 విజేతలకు ఘన సన్మానం:ప్రిన్సిపాల్ బండి శ్రీనివాస్, ఖబడ్దార్ బిఆర్ఎస్ నాయకుల్లారా రామ భక్త శ్రీ శ్రీ శ్రీ లాలు దాస్ అందరికి ఆదర్శం రక్తదానానికి యువత ముందుకు రావాలి: డీఎస్పీ ఆదినారాయణ ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు డాక్టర్ వరుణ్ కుమార్‌ కు మొక్కలు అందజేసిన

 ప్రభుదయాల్‌ పాత అనుబంధాలతో సింగరేణి సి.యం.డి

ఇటీవల సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ ఎండీగా నియమితులైన డా.బుద్ధ ప్రకాష్ జ్యోతి కొత్తగూడెం పర్యటనలో భాగంగా పాత అనుబంధాలను గుర్తుచేసుకున్నారు.2007లో భద్రాచలం ఐటిడిఏ పీఓ పనిచేసిన సమయంలో గిరిజన విద్యా కళాశాల ప్రిన్సిపాల్‌గా సేవలందించిన డా. ప్రభుదయాల్ నివాసాన్ని సందర్శించారు. దయాల్ బాగోగులు తెలుసుకుని,ఇటీవల వివాహం జరిగిన ఆయన కుమారుని వధూవరులను ఆశీర్వదించారు. తన హయాంలో కళాశాలకు జాతీయ ఉపాధ్యాయ మండలి గుర్తింపు,బీఈడీ 200 సీట్లు,నూతన భవనాలు, కంప్యూటర్ ల్యాబ్, గ్రంథాలయం,అలాగే ఇగ్నో (IGNOU) స్టడీ సెంటర్ ఏర్పాటైన విషయాలను గుర్తుచేశారు.కళాశాల అభివృద్ధికి దయాల్ చేసిన సేవలను అభినందించిన సియండి, అంకితభావంతో పనిచేస్తే గొప్ప ఫలితాలు సాధ్యమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా దయాల్ కుటుంబ సభ్యులు ఆయనను ఘనంగా సన్మానించారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest