UPDATES  

 పూర్వ విద్యార్థుల ఆర్థిక సహాయం

కష్టాల్లో ఉన్న స్నేహితుడికి అండగా నిలిచిన పూర్వ విద్యార్థులు

బోయినపల్లి ,జూలై 25 (తెలంగాణ వాణి) :

తమతో చదివిన స్నేహితుడు కష్టాల్లో ఉండని తెలిసి అండగా నిలిచారు పూర్వ విద్యార్థులు,బోయినపల్లి మండలం విలాసాగర్ గ్రామంలోని జెడ్పీ. హెచ్. ఎస్ విలాసాగర్ పాఠశాలలో 2006-07 పదవ తరగతి బ్యాచ్ కి చెందిన పూర్వ విద్యార్థులు తమ తోటి స్నేహితుడికి ఆర్థిక సాయం చేసారు,తమ స్నేహితుడి తండ్రి పొత్తూరి రామయ్య విలాసాగర్ గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికుడిగా పనిచేస్తూ ఇటీవల అనారోగ్యంతో మరణించడం జరిగింది,విషయం తెలుసుకున్న పూర్వ విద్యార్థులు కొంత డబ్బు జమ చేసారు,అలా పోగు చేసిన రూ.14,200 నగదును స్నేహితుడి ఇంటికి వెళ్ళి అందజేశారు,ఈ కార్యక్రమంలో దమ్మ మల్లిఖార్జున్, సంబ మహేష్,పండుగ బాపిరాజు,పొన్నం మధు,రంజిత్ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest