పాల్వంచ మండలం కిన్నెరసాని వద్ద ఉన్న మోడల్ స్పోర్ట్స్ స్కూల్ లో మంగళవారం దోమల నివారణ చర్యల్లో భాగంగా పైరిత్రం పిచికారీ చేశారు.వైద్యాధికారులు మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ దోమకాటుకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే రక్తపరీక్షలు చేయించుకోవాలని సూచించారు. దోమకాటు వల్ల మలేరియా,డెంగ్యూ వ్యాధులు వ్యాప్తి కాకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ దేవేందర్ నాయక్, సబ్ యూనిట్ ఆఫీసర్ జేతురాం, పాఠశాల హెచ్.ఎమ్. ఎన్. చందు,హెల్త్ అసిస్టెంట్లు శంకర్,సురేష్,రామిరెడ్డి, ఏఎన్ఎం శ్రీవిద్య,ఆశా కార్యకర్తలు,స్థానిక ఏఎన్ఎంలు,పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Post Views: 176



