సిరిసిల్ల కలెక్టర్ ఎం. హరిత కీలక నిర్ణయం
రాజన్న సిరిసిల్ల జిల్లా,అక్టోబర్ 5 (తెలంగాణ వాణి):
సిరిసిల్ల సమీకృత కార్యాలయాల సముదాయంలో ప్రతి సోమవారం నిర్వహించబడే ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎం. హరిత ప్రకటించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలై, కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ప్రజల వినతులను స్వీకరించడం ఎన్నికల నియమావళికి విరుద్ధమని ఆమె స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్ ముగిసేంతవరకు ప్రజావాణి కార్యక్రమం నిలిపివేయబడుతుంది. అనంతరం యధావిధిగా పునరుద్ధరిస్తాం కలెక్టర్ ఎం. హరిత జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని, ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ప్రజావాణిని యథావిధిగా పునఃప్రారంభిస్తామని ఆమె తెలిపారు.
Post Views: 202



