జుక్కల్/కామారెడ్డి (తెలంగాణ వాణి ప్రతినిది)
కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ మండల కేంద్రంలో గురువారం ఎస్సై మహేందర్ రెడ్డి మండల ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. అపరిచిత వ్యక్తులకు వ్యక్తిగత సమాచారం ఇవ్వద్దని,అనవసరమైన లింకులను ఓపెన్ చేయవద్దని సూచించారు. ఎవరైనా సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 కి సంప్రదించాలన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్సై తో పాటు సిబ్బంది వెంకట్, సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Post Views: 181