UPDATES  

 అక్రమ ఇంటి నెంబర్ల కేటాయింపుపై అధికారులకు ఫిర్యాదు

ధర్మారం (తెలంగాణ వాణి) ప్రభుత్వ ఫారంబోకు భూములలో అక్రమ ఇంటి నెంబర్లు పొందుతున్నారనే నేపంతో బీ ఆర్ ఎస్ నేతలు శనివారం ధర్మారం మండల తహసిల్దార్ దురిశెట్టి శ్రీనివాస్, ఎంపీడీవో వేముల సుమలతకు వినతిపత్రం సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశాలనుసారం ధర్మారం గ్రామపంచాయతీ పరిధిలోని ప్రభుత్వ పోరంబోకు భూములలో జరుగుతున్న అక్రమ ఇంటి నెంబర్ల కేటాయింపు పై వి ఆర్ ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో అధికారులకు వినతి పత్రం అందజేశామని తెలిపారు. గ్రామంలోని ప్రభుత్వ భూములలో నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న ఇంటి నెంబర్ల కేటాయింపు పై లేఅవుట్ లేకుండా అక్రమంగా నిర్మాణాలు చేస్తున్న వారిపై సమగ్ర విచారణ జరిపి అక్రమంగా ఇంటి నెంబర్లు పొందిన వారి ఇంటి నెంబర్లను వెంటనే రద్దు చేసి బాధ్యులపై తక్షణ చర్యలు తీసుకోవాలని వినతి పత్రంలో కోరినట్లు తెలిపారు. ఇట్టి విషయమై అధికారులు స్పందిస్తూ త్వరలోనే విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో నందిమేడారం సింగిల్ విండో చైర్మన్ ముత్యాల బలరాం రెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షుడు తుమ్మల రాంబాబు, వార్డు సభ్యులు గాజుల రాజు, నాయకులు కూరపాటి శ్రీనివాస్, మాజీ సర్పంచ్ గుర్రం తిరుపతి గౌడ్, దేవి నలిని కాంత్, గంధం తిరుపతి, దేవి రాజేందర్, వేల్పుల కుమార్ పాల్గొన్నారు.

Date of Publish : 29 August 2026, 5:36 pm Posted by : TELANGANA VANI

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest