ముంబయి ఇండియన్స్ క్రికెటర్ల పక్కన ఓ ముద్దుగుమ్మ ఉన్న ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. రోహిత్ శర్మ పక్కన ఓ అందాల భామ ఉన్న ఫోటో ఇటీవల బయటకొచ్చింది.
అదే భామ హార్దిక పాండ్యా పక్కన కూడా ఉన్న మరో ఫోటో తాజాగా వైరలవుతోంది. దీంతో ఎవరీ మిస్టరీ గర్ల్ అంటూ నెటిజన్లు సెర్చ్ చేయడం మొదలుపెట్టారు.
చివరికి తేలిందేంటంటే- ఆ అమ్మడి పేరు సెజాల్ జైస్వాల్. ఆమె ఒక టీవీ నటి. దిల్ మాంగే మోర్, డేటింగ్ ఇన్ డార్క్ వంటి సీరియళ్లలో నటిచింది ఈ ముద్దుగుమ్మ. 19 ఏళ్ల సెజాల్.. ముంబయి ఇండియన్స్ కి వీరాభిమాని. అందుకనే ముంబయి ఇండియన్ క్రికెటర్లతో ఫోటోలు తీయించుకునేందుకు ఆరాటపడుతోందట. సెజాల్ చిన్న వయసులోనే మోడలింగ్ మొదలుపెట్టి, టీవీ సీరియళ్లలో నటిస్తూ బిజిగా మారింది.
Post Views: 70