UPDATES  

 రోహిత్ శర్మే అనుకున్నాం.. మలింగతో కూడా బయటపడ్డ విభేదాలు

ముంబై ఇండియన్స్ జట్టుకు ఎంతో మంది క్రికెట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడా ఫ్యాన్సే ఆ జట్టును తిట్టిపారేస్తున్నారు. రోహిత్ శర్మ కెప్టెన్సీగా ఉన్నప్పటి జట్టులా అనిపించట్లేదు.

కొత్త సారథి హార్థిక్ పాండ్యా జట్టులో చేరడంతో రెండు వర్గాలుగా చీలిపోయినట్లు తెలుస్తోంది. అసలు ముంబై జట్టులో ఏం జరుగుతుంది..? వీళ్ల విభేదాలతో కనీసం ప్లే ఆఫ్ కు చేరేలా పరిస్థితి కనపడటం లేదు.

 

ముంబై ఇండియన్స్ కు కొత్త కొప్టెన్ హార్థిక్ పాండ్యా వచ్చినప్పటి నుంచి జట్టులో విభేదాలు తలెత్తాయి. దీంతో జట్టులోని ఆటగాళ్లు, పలువురు సిబ్బంది హార్ట్ బ్రోకెన్ ఎమోజీలతో తన మనసులోని మాటను బయటపెట్టారు. ఇప్పుడు హార్ధిక్ పాండ్యా జట్టు పగ్గాలు చేపట్టి రెండు మ్యాచ్ లు జరిగిన తర్వాత కూడా ముంబై శిబిరంలో పరిస్థితులు సజావుగా లేవు. ఇకపోతే.. ఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ ముంబై ఇండియన్స్ ఓటమి పాలైంది.

 

ఈ క్రమంలో.. సన్ రైజరస్ తో జరిగిన మ్యా్చ్ లో బౌలింగ్ కోచ్ మలింగతో హార్ధిక్ పాండ్యాకు విబేధాలు ఉన్నట్లు ఈ వీడియో చూస్తే బయటపడింది. అందుకు సంబంధించి ఓ వీడియో వైరల్ అవుతుంది. సన్ రైజర్స్ చేతిలో ఓటమి పాలైన తర్వాత… హార్దిక్ పాండ్యా తమ బౌలింగ్ కోచ్ లసిత్ మలింగను ఏదో మొక్కుబడిగా ఆలింగనం చేసుకుని, కనీసం ముఖం కూడా చూడకుండా వెళ్లిపోయాడు. అంతకుముందు.. మలింగ, హార్ధిక్ కు సంబంధించిన మరో వీడియో వైరల్ అవుతుంది. మలింగ, పొలార్డ్ డగౌట్ లో కూర్చుని ఉండగా.. అక్కడ పాండ్యా నిలుచుని ఉన్నాడు. అయితే.. పొలార్డ్ పైకి లేచి పాండ్యాను కూర్చోమని చెప్పేలోపు.. మలింగ ఒక్కసారిగా పైకి లేచి, పొలార్డ్ ను లేవొద్దని చెప్పి, తాను అక్కడ్నించి వెళ్లిపోయాడు. పాండ్యా పక్కన కూర్చోవడం ఇష్టం లేకనే మలింగ వెళ్లిపోయాడన్నది ఆ వీడియోలో అర్థమవుతున్నట్లుగా ఉంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest