UPDATES  

 బెంగళూరే కాదు.. హైదరాబాద్‌తో సహా ఆ 30 నగరాలకు పొంచి ఉన్న నీటి కష్టాలు!

వేసవి ప్రారంభంకాక ముందే బెంళూరులో నీటి కష్టాలు తారా స్థాయికి చేరుకుంది. ఇప్పటికే అక్కడి ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్నప్పటికీ బెంగళూరు నగర వాసుల జీవనం దినదినగండంగా మారింది.

భారత సిలికాన్ వ్యాలీగా గుర్తింపు తెచ్చుకున్న ఈ నగరం ప్రజలు బకెట్ నీళ్ల కోసం పడిగాపులు కాస్తున్నారు. బెంగళూర్‌ నగరం పూర్తిగా భూగర్భ జలాలు, కావేరీ నది నీటీపై ఆధారపడింది. ఈ ఏడాది ఒక్కసారిగా భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో సమస్య మొదలైంది. దీంతో అక్కడి ప్రజలు మంత్రం జపిస్తున్నారు. నీటి దుర్వినియోగానికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు సైతం హెచ్చరిస్తున్నారు. వర్షాకాలం వచ్చే వరకు ఈ పరిస్థితి తప్పదని పేర్కొంది. కాగా బెంళూరుకి ఈ విధమైన నీటి సంక్షోభం కొత్తేమీ కాదు.

దాదాపు ప్రతి వేసవిలో నీటి కష్టాలు ఎదుర్కొంటోంది. గతేడాది వర్షాభావ పరిస్థితుల కారణంగా ఈ ఏడాది ఊహించని విధంగా ముందుగానే నీటి వనరులు అడుగంటి పోయాయి. ఈ విధమైన నీటి సంక్షోభం ఒక్క బెంగళూరుకే పరిమితం కాదు భవిష్యత్తులో నగరాలు నీటి కొరత అంచున ఉన్నాయి. 2030 నాటికి భారత జనాభాలో 40 శాతం మందికి తాగునీరు దొరకని పరిస్థితి ఎదురవుతుందని నీతి ఆయోగ్‌ 2019లోనే నివేదిక ఇచ్చింది. బెంగళూరుతో పాటు ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, జైపూర్, బటిండా, లక్నో, చెన్నై వంటి దాదాపు 30 నగరాలు నీటి ఎద్దడిని ఎదుర్కోనున్నాయి.

వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ (WWF) 2020 నివేదిక ప్రకారం 2050 నాటికి దేశంలోని 30 నగరాలు నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటాయని స్పష్టం చేసింది. ఇందులో ఢిల్లీ, శ్రీనగర్, కోల్‌కతా, బెంగళూరు, ముంబై, జైపూర్, ఇండోర్, అమృత్‌సర్, పూణె, కోజికోడ్ మరియు విశాఖపట్నం ఉన్నాయి. దేశంలోని సింధు-గంగా పరివాహక ప్రాంతంలోని కొన్ని ప్రాంతాలు ఇప్పటికే భూగర్భ జలాల క్షీణత ఎదొర్కొంటున్నట్లు 2023లో ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడించింది. వేగవంతమైన పర్యవరణ క్షీణత, భూగర్భజలాల క్షీణత, పర్వత హిమానీనదం కరిగిపోవడం, అంతరిక్ష శిధిలాలు, భరించలేని వేడి, బీమాలేని భవిష్యత్తు మునుముందు మానవ జీవితాన్ని దుర్భరం చేస్తాయని పేర్కొంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest