UPDATES  

NEWS

 ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ లో సీపీ టీం ఘన విజయం

నిజామాబాద్ జనవరి 09: (తెలంగాణ వాణి ప్రతినిధి) 

సిపి టీం వర్సెస్ ప్రెస్ క్లబ్ ఎలెవన్ జట్ల మధ్య జరిగిన ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ లో పోలీస్ కమిషనర్ ఎ లేవన్ టీం ఘనవిజయం సాధించింది.నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో శుక్రవారం పోలీస్ టీం ప్రెస్ క్లబ్ టీం ల మధ్య పెండ్లి క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. మొదట టాస్ గెలిచి పోలీస్ టీం బ్యాటింగ్ ను ఎంచుకున్నారు. నిర్ణీత 12 ఓవర్ ల లో పోలీస్ టీం మూడు వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేశారు. పోలీస్ టీం లో బ్యాటింగ్ చేసిన ఎస్ఐ కిరణ్ పాల్ 96 పరుగు లు చేసి నాట్ అవుట్ గా నిలిచారు. అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన నిజామాబాద్ ఏసిపి రాజా వెంకటరెడ్డి 25 పరుగులు చేశారు. బౌలింగ్లో ఒక వికెట్ తీశారు. సెకండ్ బ్యాటింగ్కు దిగిన ప్రెస్ క్లబ్ జట్టు నిర్ణీత 12 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 90 పరుగులు చేసింది. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య 3 ఓవర్లు వేసి ప్రతి ఓవర్ లో ఒక వికెట్ చొప్పున మూడు వికెట్లు తీశారు. అదనపు డీసీపీ బస్వా రెడ్డి ఒక ఓవర్ వేసి ఒక వికెట్ తీశారు. ప్రెస్ క్లబ్ జట్టులో శివ ఠాగూర్ అద్భుతమైన బ్యాటింగ్ ను ప్రదర్శించి 24 పరుగులు చేశారు. 43 పరుగుల తేడాతో పోలీస్ జట్టు ప్రెస్ క్లబ్బు జట్టు పై విజయం సాధించారు.ఈ మ్యాచ్ లో బెస్ట్ బౌలర్ శ్యామ్ సుందర్ , ఉత్తమ బ్యాట్ మెన్ కిరణ్ పాల్ లకు సిపి సాయి చైతన్య మరియు అదనపు కలెక్టర్ అంకిత్ లు బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ అడ్మిన్ జి. బస్వా రెడ్డి , నిజామాబాద్ ఏసిపి రాజా వెంకట్ రెడ్డి మరియు సిఐలు ఎస్సైలు పత్రిక ప్రతినిధులు పాల్గొనడం జరిగింది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest