చుంచుపల్లి మండలం నంద తండా గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బిఆర్ఎస్ పార్టీ తరఫున జయరాం నాయక్ నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ ఆదేశాలు,గ్రామస్తుల అండతో నామినేషన్ తర్వాత ఇంటింటికి తిరుగుతూ ప్రచారాన్ని ప్రారంభించారు.జయరాం నాయక్ మాట్లాడుతూ.. నంద తండా ప్రజలకు నేను సుపరిచితుడిని,ఎన్నో సంవత్సరాలుగా స్వచ్ఛంద సేవలు చేస్తూ సామాన్యులకు సహాయం అందిస్తున్నాను.పార్టీ విధేయతతోనే పోటీ చేస్తున్నాను.గ్రామ ప్రజలు ఆశీర్వదిస్తే నంద తండాను మోడల్ గ్రామంగా తీర్చిదిద్దుతానని తెలిపారు.గ్రామ అభివృద్ధిపట్ల తన కుటుంబం పదేళ్లుగా చూపుతున్న సేవా భావం కొనసాగుతుందని, పదవి ఉన్నా లేకున్నా సేవే లక్ష్యమని స్పష్టంచేశారు.జయరాం నాయక్ గెలుపు ఖాయం అని గ్రామస్తులు విశ్వాసం వ్యక్తం చేశారు.
Post Views: 44



