గంగారం గ్రామపంచాయతీ పరిధిలోని సంపత్ నగర్‌లో గిరిజన బాలలాజీ స్వామివారి ఆలయంలో కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్తలు కొండపల్లి గోపాలకిషన్, రజిత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అర్చకులు అక్కినపల్లి సోమాచార్యులు, యజ్ఞికులు రంగం అజయ్ కుమార్, సాయి చక్రి చార్యులు స్వామివారి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. కార్యక్రమాన్ని ఇస్లావత్ బాలు బృందం సమన్వయం చేశారు. ఈ వేడుకలో గిరిజన ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి. హాథీరామ్ నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.స్వామివారి కళ్యాణోత్సవంలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. జగన్, హరిలాల్, కన్నా నాయక్, లక్కినేని సురేందర్, దల్సింగ్ నాయక్, బాలాజీ నాయక్, శంభు నాయక్, సురేష్, బిచ్చు నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 10