UPDATES  

NEWS

వివేకానంద పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ ఈనెల 18న తెలంగాణ రాష్ట్ర బంద్ ని విజయవంతం చేద్దాం కటికనపల్లి ట్రాక్టర్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షునిగా సాయిలు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ విద్యార్థిని పరామర్శించిన టిజిపిఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు దార మధు టేకులపల్లి టీఎస్‌యుటిఎఫ్‌ మండల ప్రధాన కార్యదర్శి డి.హరి నాయనమ్మ దశదిన కార్యక్రమానికి హాజరై శ్రద్ధాంజలి ఘటించిన టిఎస్ యుటిఎఫ్ నాయకులు  పెద్దిరెడ్డి రియాన్ చక్రవర్తి ని ఆశీర్వదించిన రాకేష్ దత్త విషాదం నింపిన పోలియో చుక్కలు పెద్దచింతకుంట గ్రామంలో ఇంటింటికి సీఐటీయూ బైండ్ల కళాకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా బైండ్ల ప్రతాప్ తడ్కల్ లో పల్స్ పోలియో కార్యాలయం

 పెద్దచింతకుంట గ్రామంలో ఇంటింటికి సీఐటీయూ

రాష్ట్ర మహాసభలకు విరాళాల సేకరించిన ఆహ్వాన సంఘం వైస్ చైర్మన్ ఎం. అడివయ్య

నర్సాపూర్/ పెద్ద చింతకుంట (తెలంగాణ వావాణి ప్రతినిధి) కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం పోరాడుతున్న సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర 5వ మహాసభలు జయప్రదం చేయడం కోసం కార్మికులు, ప్రజలు విరాళాలు ఇవ్వాలని సీఐటీయూ రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘం వైస్ చైర్మన్ ఎం. అడివయ్య పిలుపునిచ్చారు. మెదక్ పట్టణ కేంద్రంలో డిసెంబర్ 7,8,9 మహాసభలు నిర్వహిస్తున్నామని, మహాసభలా నిర్వహణ కోసం ఆదివారం నర్సాపూర్ మండలం పెద్దచింతకుంట గ్రామంలో ఇంటింటికి విరాళాలు సేకరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నిరంతరం కార్మికుల పక్షాన పోరాటాలు నిర్వహిస్తున్న సంఘం సీఐటీయూ అన్నారు. తెలంగాణ రాష్ట్ర 5వ మహాసభలు మెదక్ జిల్లాలో తొలి సారిగా నిర్వహిస్తున్నామని తెలిపారు.జిల్లాలో సంగటిత, అసంగటిత రంగ కార్మికుల సమస్యలపై అనేక ఉద్యమాలు నిర్వహించడం జరిగిందని అన్నారు. స్కీమ్ వర్కర్లతో ప్రభుత్వాలు వెట్టిచకిరి చేయిస్తున్నాయని అన్నారు. పారిశ్రామిక ప్రాంతాల్లో కనీస వేతనాలు అమలు చేయకుండా కార్మికుల శ్రమను యాజమాన్యలు దోచుకుంటున్నాయని అన్నారు.ఆటో, హామాలి, భవన నిర్మాణ కార్మికులకు రక్షణ లేకుండా పోతుందని అన్నారు.ఈ మహాసభలలో కార్మికుల సమస్యలను చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. జిల్లాలోని కార్మికులు, ప్రజలు విరాళాలు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కడారి నాగరాజు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest