UPDATES  

NEWS

ముస్లిం సోదరీమణులకు రంజాన్ తోఫా అందజేసిన టిఎన్ఆర్ ట్రస్ట్ ప్రపంచ కార్మిక వర్గానికి మార్గదర్శకుడు కారల్ మార్క్స్ : ఎమ్మెల్యే, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పాల్వంచలో ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్‌కు ప్రముఖుల హాజరు బడ్జెట్‌లో విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలి: ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావుకు AISF వినతి సర్వారాం గ్రామంలో ప్రజా పాలనలో భాగంగా శుభ్రత కార్యక్రమం: సర్పంచ్ భూక్యా సునీత రాంబాబు గొందిగూడెం పాఠశాలలో అభివృద్ధి పనులకు భూమిపూజ… మినీ ఆర్వో ప్లాంట్ ప్రారంభం ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక రాజాపురం పాఠశాలలో పారిశుధ్య కార్యక్రమాలు  ప్రగతి ప్రణాళికలో భాగంగా సర్పంచ్‌ల శిక్షణలో పాల్గొన్న సర్పంచ్ తాటి అనిత ప్రాథమిక పాఠశాల రాజాపురంలో అభివృద్ధి పనులు సంఘమే శరణ్యం.. సంఘమే శాశ్వతం

 ఒకేసారి టీ.పీసీసీ అధ్యక్షుడు, కొత్త మంత్రుల పేర్ల ప్రకటన

హైదరాబాద్ (తెలంగాణ వాణి కరస్పాండెంట్)

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై కసరత్తు కొనసాగుతోంది. కొత్త సారథి నియామకం, మంత్రివర్గ విస్తరణపై హైకమాండ్‌తో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చర్చలు జరుపుతున్నారు. చర్చల అనంతరం ఒకేసారి కొత్త అధ్యక్షుడి పేరుతో పాటు మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న వారి పేర్లను కూడా ప్రకటించనున్నట్లు తెలుస్తున్నది. పీసీసీ చీఫ్‌గా బీసీ నేతనే నియమించాలనే నిర్ణయానికి వచ్చినట్లు లీకులు వెలువడ్డాయి.

వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న మహేశ్‌ కుమార్ గౌడ్,  ప్రచార కమిటీ చైర్మన్‌గా ఉన్న మధుయాష్కీ గౌడ్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. మరోవైపు మంత్రివర్గంలో ఆరు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. మాజీ ఎంపీ కేశవరావు, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి కేబినెట్ హోదాతో కూడిన అడ్వయిజర్ పోస్టులు ఇచ్చినందున నాలుగింటిని మాత్రమే భర్తీ చేయాల్సి ఉంది. సామాజికవర్గాల రీత్యా చూస్తే బీసీల్లో మున్నూరుకాపు, ముదిరాజ్‌, రజక, ఎస్సీ(మాల), ఎస్టీ (లంబాడా), రెడ్డి కులాలకు అవకాశం కల్పించాల్సి ఉంది. మరి ఎవరిని అదృష్టం వరిస్తుందో చూడాలి…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest