UPDATES  

NEWS

ప్రభుదయాల్‌ పాత అనుబంధాలతో సింగరేణి సి.యం.డి ఇస్రో యువికా–26కు దరఖాస్తులు ఆహ్వానం: భద్రాది జిల్లా సైన్స్ అధికారి బి.సంపత్ కుమార్ భద్రాచలం డివిజన్ లో పి ఆర్ టి యు టి ఎస్ సమావేశం మండల స్థాయి బాల మేళా 2.0 విజయవంతం : ఎంఇఓ కృష్ణయ్య కార్పొరేటర్ చింతలపూడి శ్రావణి – సాయి కుమార్ దంపతుల చేతుల మీదుగా నూతన పట్టు వస్త్రాలు బహుకరణ హోలీ పండుగను ఘనంగా జరుపుకున్న లక్ష్మీదేవిపల్లి పంచాయతీ సిబ్బంది కేజీబీవీ,యుఆర్‌ఎస్,సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలపై మూడు దశల పోరాటం:టీఎస్‌యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి.రాజు. రంగులమయమైన ఇండోర్ స్టేడియం: తైక్వాండో విద్యార్థుల హోలీ హంగామా ! నూతన జిల్లా కలెక్టర్ అంకిత్ ఐఏఎస్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన టిఎస్ యు.టి.ఎఫ్ భద్రాది జిల్లా కమిటి  సేవాలాల్ సద్గురు చూపిన మార్గం ఆదర్శనీయం: వైరా ఎమ్మెల్యే మాళోత్ రాందాస్ నాయక్

 టీజేటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జాడి శ్రీనివాస్

ధర్మారం (తెలంగాణ వాణి విలేఖరి) తెలంగాణ జాగృతి టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం శాయంపేట ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు జాడీ శ్రీనివాస్ ఎన్నికయ్యారు. ఇటీవల రాష్ట్రస్థాయిలో ఉపాధ్యాయ సమస్యలపై పోరుబాట మొదలుపెట్టిన తెలంగాణ జాగృతి స్వచ్ఛంద సంస్థ తెలంగాణ జాగృతి టీచర్స్ ఫెడరేషన్ ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయ సమస్యల సాధన కొరకు స్థాపించిన నూతన సంఘంలో ఉపాధ్యాయ సమస్యలపై, విద్యారంగ వ్యవస్థపై అవగాహన కలిగిన జాడీ శ్రీనివాస్ ను తొలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నియమించారు. వీరి నియామకం పట్ల ధర్మారం మండల ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. తనను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించడం పట్ల జాడీ శ్రీనివాస్ అధినేత్రి కవితక్కకు కృతజ్ఞతలు తెలిపారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest